వరిగల తో దద్యోజనం | Millets curd rice Recipe in Telugu

ద్వారా Swathi Ravinuthula  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Millets curd rice recipe in Telugu,వరిగల తో దద్యోజనం, Swathi Ravinuthula
వరిగల తో దద్యోజనంby Swathi Ravinuthula
 • తయారీకి సమయం

  40

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

0

0

వరిగల తో దద్యోజనం వంటకం

వరిగల తో దద్యోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Millets curd rice Recipe in Telugu )

 • వరిగలు 1 cup
 • పెరుగు ఇష్టానుసారం
 • పచ్చిమిరపకాయలు 4
 • పోపు దినుసులు 1 చెంచా
 • కరివేపాకు ఒక రెమ్మ
 • ఉప్పు రుచికి సరిపడా
 • శొంఠి పొడి కొద్దిగా
 • ఇంగువ కొద్దిగా
 • కొత్తిమీర

వరిగల తో దద్యోజనం | How to make Millets curd rice Recipe in Telugu

 1. ముందుగా వరిగలను కడిగి అర్ధగంట నానపెట్టుకోవాలి .
 2. తర్వాత విడిగా అన్నం వండుకున్నట్లు వండుకోండి .
 3. పక్కన బాణలిలో నూనె వేసి పోపు అనగా ఆవాలు,మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ,కరివేపాకు, సన్నగాపొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి .
 4. వండుకున్న వరిగల అన్నం ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారాక కావాలిసినంత పెరుగు కలుపుకోండి .
 5. సాల్ట్ వేసి కలిపి పోపు వేసి కలుపుకొని పైన కొత్తిమీర తో గార్నిష్ చేస్తే సరి.

Reviews for Millets curd rice Recipe in Telugu (0)