హోమ్ / వంటకాలు / చల్లపిండి ( చల్ల ఉప్మా)

Photo of Curd upma by మనస్విని శెట్టి at BetterButter
0
3
0(0)
0

చల్లపిండి ( చల్ల ఉప్మా)

Aug-10-2018
మనస్విని శెట్టి
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్లపిండి ( చల్ల ఉప్మా) రెసిపీ గురించి

బియ్యం పిండి ,మజ్జిగ తో చేసుకునే సులువైన అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి ఒక కప్పు
  2. మజ్జిగ రెండు కప్పులు
  3. పచ్చిమిర్చి ముక్కలు రెండు స్పూన్లు
  4. ఉల్లిపాయలు ముక్కలు పావు కప్పు
  5. కేరట్ తురుము పావు కప్పు
  6. జీలకర్ర 1/4 స్పూను
  7. ఆవాలు 1/4 స్పూను
  8. పచ్చి సేనగపప్పు 1/2 స్పూను
  9. మినప్పప్పు 1/4 స్పూను
  10. కరివేపాకు ఒక రెమ్మ
  11. కొత్తిమీర ఒక స్పూను
  12. ఉప్పు రెండు స్పూన్లు
  13. నూనె రెండు స్పూన్లు

సూచనలు

  1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి
  2. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సేనగపప్పు ,కరివేపాకు వేసుకోవాలి
  3. తాలింపు వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  4. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా కేరట్ ముక్కలు కూడా వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి,మజ్జిగ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి
  6. ఉల్లిపాయ ముక్కలు అవి వేగిన తరువాత బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి కలపాలి
  7. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలి
  8. ఉప్మా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి
  9. ఉప్మా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆపేయాలి
  10. చల్ల ఉప్మా సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర