హోమ్ / వంటకాలు / మునక్కాయ సాంబార్

Photo of MUNAKKAAYA saambhaar by Kavitha Perumareddy at BetterButter
401
2
0.0(0)
0

మునక్కాయ సాంబార్

Aug-10-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునక్కాయ సాంబార్ రెసిపీ గురించి

ఈ వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది .ఎందుకు అంటే మన ఇంటిలో అందరి ఆరోగ్యం దృష్ట్యా మునక్కాయ వంటలలో వాడడం అవసరం .మునక్కాయ లో పోషకవిలువలు చాలా ఉంటాయి.శరీరానికి కావలసిన ఐరన్ , విటమిన్స్ పుష్కలంగా దొరుకుతుంది. కూరగా కానీ ,చారు గా కానీ,ఏరూపంలో ఐనా సరే తీసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మునక్కాయ లు నాలుగు
  2. కంది పప్పు 150 గ్రామ్స్
  3. టమాటాలు 2
  4. ఉల్లిగడ్డ 1
  5. .పచ్చిమిర్చి 3
  6. చింతపండు కొద్దిగా.
  7. ఉప్పు తగినంత.
  8. కరేపాకు 2 రెమ్మలు
  9. కొత్తిమీర గుప్పెడు
  10. పోపుగింజెలు 1 స్పున్
  11. నూనె పెద్ద స్పున్ 1
  12. ఎండుమిర్చి ,2
  13. వెల్లుల్లి 5రెబ్బలు
  14. సాంబార్ పొడి చిన్న స్పున్
  15. పసుపు పావు స్పున్

సూచనలు

  1. ముందుగా కందిపప్పు కడిగి ఒక 15 నిముసాలు నానబెట్టాలి.
  2. పప్పు నానేలోపు ములక్కాడలు పీచు తీసి 2 ఇంచుల ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .మిగతా కూరగాయలు అన్ని పొడవుగా తరుక్కోవాలి.
  3. ఇప్పుడు కందిపప్పు ను కొంచెం పసుపు, నాలుగు చుక్కలు నూనె వేసి ఉడికించి మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టుకొని నూనె వేసికాగిన తరువాత ,పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి,కరేపాకు వేసుకొని వేగినతరువాత
  5. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగినతారువాత టమాటాలు వేసుకోవాలి.ఇవికొద్దిగా మగ్గిన తరువాత మునక్కాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కాసేపు అంటే 5 నిముసాలు పాటు వేయించాలి.
  6. ఇప్పుడు దానిలో పప్పు ను వేయాలి తగినంత నీళ్లు పోసుకొని అంత కలపాలి .నానబెట్టిన చింతపండు రసం తీసి కలుపుకోవాలి.సాంబార్ పొడి వేయాలి. మరుగుతున్న సాంబార్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది.
  7. ఒక15 నిముసాలు సాంబార్ ని ఉడికించాలి .మునక్కాయలు ఉడికే వరకు ఉడికించాలి.
  8. ఇక స్టవ్ ఆఫ్ చేసి వడ్డించే గిన్నెలోకి తీసుకొని మిగిలిన కొత్తిమీర తో అలంకరించాలి. అంతే ఇంకా మునక్కాయ సాంబార్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర