సేమియా పులిహోర | Semiya pulihora Recipe in Telugu

ద్వారా Divya Bharathi Thondapu  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Semiya pulihora recipe in Telugu,సేమియా పులిహోర , Divya Bharathi Thondapu
సేమియా పులిహోర by Divya Bharathi Thondapu
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

0

0

సేమియా పులిహోర వంటకం

సేమియా పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semiya pulihora Recipe in Telugu )

 • 1 కప్పు సేమియా
 • నిమ్మ రసం రుచికి సరిపడా
 • ఉప్పు తగినంత
 • 1/2 చెంచా పసుపు
 • 1 చెంచా జీలకర్ర
 • 1 చెంచా ఆవాలు
 • 2 చెంచాలు పచ్చి పప్పు
 • 2 చెంచాలు పల్లీలు
 • 2 రెమ్మలు కరివేపాకు
 • కొతిమీరు కొంచెం
 • 4 పచ్చి మిరపకాయలు
 • 2 ఎండు మిరపకాయలు
 • 3 చెంచాలు వంట నూనె

సేమియా పులిహోర | How to make Semiya pulihora Recipe in Telugu

 1. ఒక కప్పు సేమియా ని ఒక గిన్నె లోకి తీసుకొని సరిపడా నీళ్లు పోసుకొని 3 నుండి 4 నిమిషాల వరకు ఉడికించుకోండి .
 2. సేమియా ఉడికిన తరువాత నీళ్లు ఒంపుకుని ఒక ప్లేట్ లో విడి విడి గ పరుచుకొని పూర్తిగా చల్లార నివ్వండి .
 3. ఉడికించి చల్లార్చిన సేమియా లో రుచికి సరిపడా నిమ్మరసం మరియు ఉప్పు వేసుకొని కలుపుకోండి .
 4. ఒక కడ్తాయి పెట్టుకొని మూడు చెంచాల నూనె వేసుకోండి
 5. నూనె వేడయ్యాక చీలిక గా కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని వేయించి సేమియా లో కలుపుకోండి
 6. అదే కడాయి లో పల్లీలు కూడా వేసుకోవాలి
 7. పల్లీలు సగం వేగాక పచ్చి పప్పు, జీలకర్ర , ఆవాలు,కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి
 8. పోపు దినుసులు వేగాక పసుపు వేసి పది సెకండ్లు వేయించండి
 9. పొయ్యి కట్టేసి కొత్తిమీర వేసుకోండి
 10. తయారు చేసుకున్న ఈ పోపు మిశ్రమాన్ని సేమియా లో వేసుకొని బాగా కలుపుకోండి
 11. ఎంతో రుచిగా ఉండే సేమియా పులిహోర రెడీ .

నా చిట్కా:

సేమియా ని ఉడికించుకున్న తరువాత చల్ల నీళ్ళల్లో వేసుకుంటే సేమియా విడి పోయి విడి విడిగా వస్తాయి .

Reviews for Semiya pulihora Recipe in Telugu (0)