హోమ్ / వంటకాలు / సేమియా పులిహోర

Photo of Semiya pulihora by Divya Bharathi Thondapu at BetterButter
89
1
0.0(0)
0

సేమియా పులిహోర

Aug-10-2018
Divya Bharathi Thondapu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పులిహోర రెసిపీ గురించి

సేమియా ఉప్మా అందరికి తెలుసు కానీ సేమియా పులిహోర కొందరికి మాత్రమే పరిచయం . ఇది ఎంతో రుచిగా ఉంటుంది చేసుకోవటం కూడా చాలా తేలిక .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 1

  1. 1 కప్పు సేమియా
  2. నిమ్మ రసం రుచికి సరిపడా
  3. ఉప్పు తగినంత
  4. 1/2 చెంచా పసుపు
  5. 1 చెంచా జీలకర్ర
  6. 1 చెంచా ఆవాలు
  7. 2 చెంచాలు పచ్చి పప్పు
  8. 2 చెంచాలు పల్లీలు
  9. 2 రెమ్మలు కరివేపాకు
  10. కొతిమీరు కొంచెం
  11. 4 పచ్చి మిరపకాయలు
  12. 2 ఎండు మిరపకాయలు
  13. 3 చెంచాలు వంట నూనె

సూచనలు

  1. ఒక కప్పు సేమియా ని ఒక గిన్నె లోకి తీసుకొని సరిపడా నీళ్లు పోసుకొని 3 నుండి 4 నిమిషాల వరకు ఉడికించుకోండి .
  2. సేమియా ఉడికిన తరువాత నీళ్లు ఒంపుకుని ఒక ప్లేట్ లో విడి విడి గ పరుచుకొని పూర్తిగా చల్లార నివ్వండి .
  3. ఉడికించి చల్లార్చిన సేమియా లో రుచికి సరిపడా నిమ్మరసం మరియు ఉప్పు వేసుకొని కలుపుకోండి .
  4. ఒక కడ్తాయి పెట్టుకొని మూడు చెంచాల నూనె వేసుకోండి
  5. నూనె వేడయ్యాక చీలిక గా కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని వేయించి సేమియా లో కలుపుకోండి
  6. అదే కడాయి లో పల్లీలు కూడా వేసుకోవాలి
  7. పల్లీలు సగం వేగాక పచ్చి పప్పు, జీలకర్ర , ఆవాలు,కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి
  8. పోపు దినుసులు వేగాక పసుపు వేసి పది సెకండ్లు వేయించండి
  9. పొయ్యి కట్టేసి కొత్తిమీర వేసుకోండి
  10. తయారు చేసుకున్న ఈ పోపు మిశ్రమాన్ని సేమియా లో వేసుకొని బాగా కలుపుకోండి
  11. ఎంతో రుచిగా ఉండే సేమియా పులిహోర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర