వెజ్ బిర్యానీ | VEGTABLE BIRYANI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of VEGTABLE BIRYANI by Ram Ram at BetterButter
వెజ్ బిర్యానీby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

వెజ్ బిర్యానీ వంటకం

వెజ్ బిర్యానీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VEGTABLE BIRYANI Recipe in Telugu )

  • బీన్స్ ముక్కలు 1/2 కప్పు
  • ఆలూ ముక్కలు 1/2కప్పు
  • కేరెట్ ముక్కలు 1/2కప్పు
  • క్యాబేజీ ముక్కలు 1/2 కప్పు
  • పచ్చి మిర్చి 6
  • పుదీనా కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • పసుపు 1/4స్పూన్
  • నిమ్మకాయ 1
  • దాల్చిన చెక్క చిన్నది
  • ఇలాచి 2
  • లవంగాలు 4-5
  • జాజి కాయ చిన్న ముక్క
  • బిర్యానీ ఆకు 5
  • షాయి జీరా 1స్పూన్
  • అల్లం వెల్లులి పేస్ట్ 2స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • బియ్యo 1గ్లాస్
  • నీళ్లు 2 1/2గ్లాసులు
  • పెరుగు
  • నెయ్యి
  • నూనె

వెజ్ బిర్యానీ | How to make VEGTABLE BIRYANI Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలన్నింటిని బాగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి..
  2. ఇప్పుడు ఒక గిన్నెలో కూరగాయ ముక్కలు పెరుగు అల్లం వెల్లులి పేస్ట్ ఉప్పు ముక్కలకు సరిపడా ,పసుపు నిమ్మరసం వేసి బాగా కలిపి పెట్టాలి..
  3. ఇప్పుడు ఒక మందపాటి బాండీ పెట్టి నెయ్యి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి..
  4. వేడి అయ్యాక బిర్యానీ దినుసులు అన్ని వేయాలి..వాటితో పాటు పుదీనా పచ్చిమిర్చి చిరికలు ఉల్లిపాయ చిరికలు కూడా వేసుకుని వేయించాలి..
  5. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి..
  6. అవి మగ్గిన తర్వాత నీళ్ళు 1 గ్లాస్ బియ్యానికి 2గ్లాసుల నీళ్లు..కూరగాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి 2 1/2 తీసుకోవాలి వేయాలి..నీళ్లను ముందుగానే కొలత తీసుకుని మరిగించి పెట్టాలి..ఇప్పుడు ఆ నీటిని కూరగాయ ముక్కలలో వేసుకోవాలి..
  7. ఇప్పుడు నీరు వెంటనే మరుగుతుంది కాబట్టి కడిగిన 1గ్లాస్ బియ్యం వేసి సరిపడా ఉప్పు వేసి..మూత పెట్టి ఉడికించాలి..
  8. అన్నం ఉడికిన తర్వాత కొద్దీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది..
  9. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

Reviews for VEGTABLE BIRYANI Recipe in Telugu (0)