హోమ్ / వంటకాలు / వేపుడు జావ

Photo of Vepudu java by మనస్విని శెట్టి at BetterButter
4662
2
0.0(0)
0

వేపుడు జావ

Aug-10-2018
మనస్విని శెట్టి
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేపుడు జావ రెసిపీ గురించి

బియ్యం రవ్వ, శొంఠిపొడి తో చేసుకునే ఈ జావ వర్షాకాలంలో వచ్చే కఫ,దగ్గు వంటి వాటికి మంచి ఔషధం. సనాతన పద్దతిలో చేసుకునే సులువైన అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం ఒక కప్పు
  2. నెయ్యి రెండు స్పూన్లు
  3. శొంఠి 100 గ్రాములు
  4. ఎండుమిర్చి 50 గ్రాములు
  5. పెరుగు రెండు కప్పులు
  6. నీళ్లు నాలుగు కప్పులు
  7. ఉప్పు మూడు స్పూన్లు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద కాడయి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు బియ్యం వేసి సన్నని మంట పై వేయించాలి
  3. బియ్యం కొంచెం బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  4. బియ్యం వేగిన తరువాత ఒక గిన్నెలో తీసుకోవాలి
  5. ఇప్పుడు అదే కాడయి లో శొంఠి వేసి వేయించాలి
  6. శొంఠి పగుళ్లు వచెప్పుడు ఎండుమిర్చి కూడా వేయాలి
  7. ఇప్పుడు బియ్యం ని మిక్సీ లో సన్నగా రవ్వల చేసుకోవాలి
  8. తరువాత మిక్సీ లో శొంఠి,ఎండుమిర్చి వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి
  9. ఈ శొంఠిపొడి లో తగినంత ఉప్పు వేయాలి
  10. ఇప్పుడు కాడయి లో నెయ్యి వేయాలి
  11. నెయ్యి వేడెక్కిన తరువాత నీళ్లు వేయాలి
  12. నీళ్లు పోసిన తరువాత బియ్యం రవ్వ వేయాలి
  13. రవ్వ ఉడికేవరకు జావ చేయాలి
  14. తరువాత పెరుగు లో నీళ్ళు వేసి ,శొంఠిపొడి, ఉప్పు వేసి మజ్జిగ లా చిలకాలి
  15. ఈ శొంఠి మజ్జిగ ని జావలో కలపాలి
  16. వేపుడు జావ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర