తామర గింజల కుర్మా | Pholmakhani kurma Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pholmakhani kurma recipe in Telugu,తామర గింజల కుర్మా, Divya Konduri
తామర గింజల కుర్మాby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

About Pholmakhani kurma Recipe in Telugu

తామర గింజల కుర్మా వంటకం

తామర గింజల కుర్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pholmakhani kurma Recipe in Telugu )

 • 200 గ్రాములు తామర గింజలు
 • వెన్న 20 గ్రాములు
 • దాల్చిన చెక్క 1 ముక్క
 • లవంగాలు 3
 • బిర్యాని ఆకు ఒకటి
 • ఉల్లి పేస్టు ఒక కప్పు
 • టమోట పేస్టు ఒక కప్పు
 • అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను
 • ఉప్పు తగినంత
 • కారం ఒక స్పూను
 • ధనియాల పొడి అర స్పూను
 • జీలకర్ర పొడి అర స్పూను
 • కసూరి మేతి అర స్పూను
 • కొత్తిమీర పావు కప్పు

తామర గింజల కుర్మా | How to make Pholmakhani kurma Recipe in Telugu

 1. బాండీలో వెన్న వేసి కరిగిన తరువాత పట్టా,లవంగాలు వేయాలి
 2. తరువాత ఉల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి
 3. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి టమాట పేస్టు వేసుకోవాలి
 4. తరువాత కొత్తిమీర మిగితా మసాలా పొడులు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి
 5. తామరగింజలు వేసి, కసూరి మేతి వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి
 6. పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి .
 7. ఇలా మూత పెట్టి ఉడిగికించడం వలన తామర గింజలకు మసాల పడుతుంది
 8. దీనితో మన తామర గింజల కూర రెడీ . ఉల్లి చక్రాలతో అలంకరించుకొని సర్వ్ చేసుకోండి .

నా చిట్కా:

గింజలు వేసిన తరువాత మరీ ఎక్కవ సేపు ఉడికించనవసరం లేదు

Reviews for Pholmakhani kurma Recipe in Telugu (0)