పచ్చి పులుసు | PACHHI pulusu Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of PACHHI pulusu by Kavitha Perumareddy at BetterButter
పచ్చి పులుసుby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

17

0

పచ్చి పులుసు వంటకం

పచ్చి పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PACHHI pulusu Recipe in Telugu )

 • చింతపండు 50 గ్రాములు .పెద్దనిమ్మకాయ సైజు తీసుకోవాలి
 • ఉల్లిపాయలు 2
 • పచ్చిమిర్చి 5
 • ఉప్పు తగినంత
 • బెల్లము కొద్దిగా
 • కారం చిన్న స్పున్
 • పసుపు కొద్దిగా
 • పోపుగింజెలు స్పూన్
 • ఎండుమిర్చి 2
 • వెల్లుల్లి 5 రెబ్బలు
 • నూనె 1 స్పున్
 • కరేపాకు,కొత్తిమీర కొద్దిగా

పచ్చి పులుసు | How to make PACHHI pulusu Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె తీసుకొని చింతపండు కడిగి నానపెట్టాలి .
 2. నానిన తరువాత బాగా పిసికి చింతపండు రసం తీసుకోవాలి .
 3. తగిన్నన్ని నీళ్లు 2గ్లాసులు సరిపోతుంది. దానిలో పోసి వేరే గిన్నెలోకి పీసులు లేకుండా వడకట్టుకోవాలి.
 4. ఈ చింతపండు రసంలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చిముక్కలు ,కరేపాకు,కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి.తగినంత ఉప్పు వేసుకోవాలి .
 5. బెల్లము తురుము కూడా వేసుకోవాలి .ఇవి అన్ని రసం లో కలిసేలా చేతితో నలుపుతూ కలుపుకోవాలి.
 6. ఇప్పుడు పోపు గరిటే తీసుకొని పోయిమీద పెట్టినూనెవేసి వేడి ఐన తరువాత పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేగినతారువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపులో కారం,పసుపు వేసుకొని కలిపి ముందుగా కలుపుకున్న పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలి.
 7. ఇంకా ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ...తియ్య తియ్యగా, కారం కారంగా, పుల్ల పుల్లగా భలే ఉంటుంది.

నా చిట్కా:

పచ్చి పులుసు చేసే టప్పుడు మంచి నీరు వాడితే మంచిది.ఎందుకంటే ఈ వంటని వేడి చేయము కదా .లేదా కాచి చల్లార్చిన నీటిని వాడుకోవచు

Reviews for PACHHI pulusu Recipe in Telugu (0)