హోమ్ / వంటకాలు / పచ్చి పులుసు

Photo of PACHHI pulusu by Kavitha Perumareddy at BetterButter
442
5
0.0(0)
1

పచ్చి పులుసు

Aug-10-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి పులుసు రెసిపీ గురించి

ఈ వంటకం అన్ని పచ్చివే వేసి చేస్తారు.అరుగుదలకు మంచిది.శరీరానికి చలువ కూడా ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చింతపండు 50 గ్రాములు .పెద్దనిమ్మకాయ సైజు తీసుకోవాలి
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 5
  4. ఉప్పు తగినంత
  5. బెల్లము కొద్దిగా
  6. కారం చిన్న స్పున్
  7. పసుపు కొద్దిగా
  8. పోపుగింజెలు స్పూన్
  9. ఎండుమిర్చి 2
  10. వెల్లుల్లి 5 రెబ్బలు
  11. నూనె 1 స్పున్
  12. కరేపాకు,కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని చింతపండు కడిగి నానపెట్టాలి .
  2. నానిన తరువాత బాగా పిసికి చింతపండు రసం తీసుకోవాలి .
  3. తగిన్నన్ని నీళ్లు 2గ్లాసులు సరిపోతుంది. దానిలో పోసి వేరే గిన్నెలోకి పీసులు లేకుండా వడకట్టుకోవాలి.
  4. ఈ చింతపండు రసంలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చిముక్కలు ,కరేపాకు,కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి.తగినంత ఉప్పు వేసుకోవాలి .
  5. బెల్లము తురుము కూడా వేసుకోవాలి .ఇవి అన్ని రసం లో కలిసేలా చేతితో నలుపుతూ కలుపుకోవాలి.
  6. ఇప్పుడు పోపు గరిటే తీసుకొని పోయిమీద పెట్టినూనెవేసి వేడి ఐన తరువాత పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేగినతారువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపులో కారం,పసుపు వేసుకొని కలిపి ముందుగా కలుపుకున్న పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలి.
  7. ఇంకా ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ...తియ్య తియ్యగా, కారం కారంగా, పుల్ల పుల్లగా భలే ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర