హోమ్ / వంటకాలు / గుంత పుంగణాలు

Photo of GUNTHA PUNUGULU by Sandhya Rani Vutukuri at BetterButter
1
1
0(0)
0

గుంత పుంగణాలు

Aug-11-2018
Sandhya Rani Vutukuri
1440 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంత పుంగణాలు రెసిపీ గురించి

సాధారణంగా దోశ పిండి లేని వంట ఇళ్లు ఉండేవేమో..దోశ ల తో విసిగిన వారికి అదే పిండి తో చేసే అల్పాహారమే పుంగణాలు. పిల్లలు, పెద్దలు అంతా ఇష్టం గా తినే పూర్తి నూనెలో వేయించి చేసే వంట కాదు. పిండి లో పచ్చి సనగ పప్పు కూడా వేయడం తో పోషకాలు కూడా దొరుకుతాయి. ఏ పచ్చడి తో(పల్లి/కొబ్బరి/పుట్నాల) అయినా , వేడి తగ్గినా తినవొచ్చు. పిల్లల డబ్బాల్లోకి కూడా ఫోర్క్ వేసి పంపవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు 1 కప్
  2. బియ్యం 2.5 కప్పులు
  3. ఉప్పు 1/2 చెంచా
  4. నాన పెట్టిన సేనగ పప్పు 2 చెంచాలు
  5. పచ్చి మిర్చి 2
  6. ఉల్లిపాయ సన్నని ముక్కలు 1/2 కప్పు
  7. జీలకర్ర 1 చెంచా
  8. నూనె చిన్న గిన్నెడు
  9. గుంట పుణుగుల మూకుడు 1
  10. మూత

సూచనలు

  1. మినపప్పు, బియ్యం కడిగి 6 గంట లు నాన పెట్టాలి
  2. నానిన పప్పు ను మెత్తగా నీళ్లుఎక్కువ లేకుండా దోశ లాగా గంటే జారుగా రుబ్బుకోవాలి.
  3. ఈ పిండిని 4,నుంచి 5 గంటలు పులవ నీ యాలి
  4. పిండి లో 1 గంట నాన పెట్టిన సెనగ పప్పును కలపాలి.
  5. దీనిలో రుబ్బిన 2 పచ్చి మిర్చి,ఉల్లి తరుగు, జీలకఱ్ఱ,ఉప్పు కలుపుకోవాలి
  6. పుణుగుల మూకుడు తీసుకొని పొయ్యి పైన పెట్టి, కొంచెం నూనె పూసి, చిన్న చెంచా తో పిండి వేసి, సరిపోయే మూత పెట్టాలి
  7. 2ని.ల తరువాత చిన్న కాడ లేదా చెంచాతో ఆ పుణుగుల ను తిప్పి, అవసరమైతే కొంచెం నూనె వేసుకోవాలి.
  8. అంతే గుంత పుంగణాలు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర