BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలక్ పనీర్

Photo of Palak Paneer by Tejaswi Yalamanchi at BetterButter
0
0
0(0)
0

పాలక్ పనీర్

Aug-11-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పనీర్ రెసిపీ గురించి

పాలకూర తో చేయ గలిగిన అతి రుచి కరమైన రెస్టారెంట్ స్టైల్ వంటకం పాలక్ పనీర్ అని చెప్పవచ్ఛు.ఈ కూరను అతి తక్కువ సమయంలో చాలా తేలికగా తయారు చేయ వచ్చు.సమయానికి ఇంట్లో పనీర్ ఇంకా పాల కూర ఉంటే సరిగ్గా అరగంటలో దీనిని చేసేయ వచ్చు.అందుకే నేనెప్పుడూ నా ఫ్రిజ్ లో  పనీర్ ఉండేలా చూసుకుంటాను.వారంలో ఒక సారైనా మేతి పనీర్ కానీ పాలక్ పనీర్ కానీ చేస్తుంటాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 200 గ్రాములు పాలకూర
  2. 200 గ్రాములు పనీర్
  3. 1/2 కప్పు టమాటో పేస్ట్
  4. 2 మీడియం ఉల్లిపాయలు
  5. 2 పచ్చి మిరపకాయలు
  6. 25 నుండి 30 గ్రాములు వెన్న
  7. 1 1/2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  8. 1 tsp సోంపు
  9. 2 యలుకలు
  10. 3 లవంగాలు
  11. 2 దాల్చిన చెక్కలు అంగుళం పొడవు
  12. చిటికెడు పంచదార
  13. ఉప్పు తగినంత
  14. 1 tsp కారం
  15. 1 tsp గరం మసాలా
  16. 1 tsp జీలకర్ర
  17. 1/2 tsp పసుపు
  18. 1/4 కప్పు నీళ్లు
  19. 2 tbsp క్రీమ్

సూచనలు

  1. ముందు పనీర్ ను క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. మరిగిన నీటిలో తగినంత ఉప్పు కలిపి పనీర్ ముక్కలను అందులో వేసి 5 నుండి 10 నిమిషాలు నానబెట్టాలి.
  3. పాలకూరను శుభ్రంగా కడిగిన తరువాత మరిగిన నీటిలో ఉప్పు వేసి 2 నుండి 3 నిమిషాలు నానబెట్టాలి.
  4. వేడి నీళ్లను వంపేసి వెంటనే బాగా చల్లని నీళ్లలో 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి.
  5. తర్వాత నీళ్లను వంపేసి, పాలకూరను బ్లెండర్ జార్ లోకి తీసుకొని, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ప్యూరీ లా చేసుకోవాలి.
  6. ముందుగా సోంపు మరియు ఏలకులను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  7. ఒక పెనంలో వెన్న వేసి కరగనివ్వాలి.
  8. జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  9. బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి
  10. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి.
  11. తర్వాత పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు మరియు ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
  12. 1/4 కప్పు నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.
  13. వేడిగా వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర