హోమ్ / వంటకాలు / వంకాయ అంటు పులుసు.

Photo of Vankaya antu pulusu by Lakshmi Leelavathi at BetterButter
967
0
0.0(0)
0

వంకాయ అంటు పులుసు.

Aug-11-2018
Lakshmi Leelavathi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ అంటు పులుసు. రెసిపీ గురించి

చాలా తేలికగా కమ్మగా వుండే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 10

  1. వంకాయలు 1 /2 కేజీ
  2. ఉల్లిపాయలు 4
  3. నూనె 3 టేబుల్ స్పూన్లు
  4. మెంతులు 5
  5. ఆవాలు చిటికెడు
  6. జీలకర్ర చిటికెడు
  7. ఇంగువ చిటికెడు
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. కారం 2 స్పూన్లు
  10. బెల్లం కొంచెం రుచికి తగినట్లుగా
  11. కరివేపాకు కొంచెం
  12. కొత్తిమీర కొంచెం
  13. చింతపండు నిమ్మకాయంత

సూచనలు

  1. ముందుగా వంకాయలను తీసుకుని పుచ్చులు లేకుండా చూసుకుని పొడవుగా తరిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి.
  2. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. తర్వాత బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో 3 చెంచాల నూనె వేసుకోవాలి.
  4. నూనె కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,మెంతులు వేసుకుని పోపు పెట్టుకోవాలి.తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి పచ్చి వాసన పోయేదాక వేయించుకోవాలి.
  5. తర్వాత అందులో వంకాయ ముక్కల్ని వేసుకొని తిప్పి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి.ఉప్పు వేసుకోవడం వలన వంకాయలు కాండ్ర ఎక్కకుండా ఉంటాయి.
  6. తర్వాత చింతపండు ఒక నిమ్మకాయంత తీసుకుని నాన పెట్టుకోవాలి.
  7. తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు పోసి ఉప్పు ,కారం,కొంచెం ఇంగువ,కరివేపాకు,కొత్తిమీర వేసుకొని మూటపెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా సన్నని మంట పై ఉడకనివ్వాలి.
  8. పులుసు బాగా దగ్గిర పడిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి.ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ అపుకోవడమే.అంతే ఎంతో తేలికైన వంకాయ అంటు పులుసు రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర