పూర్ణాలు | Purnalu Recipe in Telugu

ద్వారా Divya Bharathi Thondapu  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Purnalu recipe in Telugu,పూర్ణాలు , Divya Bharathi Thondapu
పూర్ణాలు by Divya Bharathi Thondapu
 • తయారీకి సమయం

  50

  నిమిషాలు
 • వండటానికి సమయం

  24

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పూర్ణాలు వంటకం

పూర్ణాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Purnalu Recipe in Telugu )

 • 1 కప్పు పచ్చి పప్పు
 • 1 కప్పు బెల్లం
 • 4 యాలుకలు
 • 2 స్పూన్లు నెయ్యి
 • 3 స్పూన్లు ఎండు కొబ్బరి
 • 1/2 కప్పు బియ్యం పిండి
 • 1/2 కప్పు మైదా పిండి
 • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

పూర్ణాలు | How to make Purnalu Recipe in Telugu

 1. ముందుగా పచ్చిపప్పు ని ప్రెషర్ కుక్కర్ లో 3 నుండి 4 విస్టల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి
 2. బెల్లం ని మెత్తగా చేసుకోవాలి
 3. పూర్ణాలకి పూతగా పిండి గ బియ్యంపిండి , మైదా పిండి రెండు ఒక గిన్నె లోకి తీసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టి గ కలుపుకోవాలి . జారుడుగా కలుపుకో కూడదు
 4. ఒక మిక్సీ జారు ని తీసుకొని అందులో ఉడికించిన పచ్చి పప్పు, బెల్లం, ఎండు కొబ్బరి , నెయ్యి, యాలకుల పొడి అన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
 5. కొంచెం కొంచెం గ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని తీసుకొని నిమ్మకాయ అంత సైజులో రౌండ్ గ చేసుకోవాలి
 6. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి
 7. ఆయిల్ వేడి అయ్యాక బియ్యం పిండి మైదా పిండి ని కలిపినా మిశ్రమం లో రౌండ్ గ చేసుకున్న బాల్ సు ని ముంచుకొని నూనె ఆయిల్ బ్రౌన్ కలర్ వచ్చే వారికి ఫ్రై చేసుకోవాలి
 8. ఏంథి రుచికరమైన పూర్ణాలు రెడీ,
 9. E purnalu ammavariki neiyvedam ga pettadam ma acharam

నా చిట్కా:

పూర్ణాలకి పూత పిండి గ దిశా పిండి కూడా వాడొచ్చు .

Reviews for Purnalu Recipe in Telugu (0)