హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ బొబ్బట్లు

Photo of Dry fruit obbatulu by Sree Vaishnavi at BetterButter
278
2
0(0)
0

డ్రై ఫ్రూట్ బొబ్బట్లు

Aug-12-2018
Sree Vaishnavi
30 నిమిషాలు
వండినది?
38 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ బొబ్బట్లు రెసిపీ గురించి

బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి.ముఖ్యంగా నేతి తో చేసిన బొబ్బట్లు ఇంకా రుచిగా ఉంటాయి.ఆంధ్రా ప్రాంతంలో అయితే దాదాపు  ప్రతీ పెళ్ళిలోను వేడుకల్లోనూ నేటి బొబ్బట్లు వడ్డిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. 250 గ్రాములు మైదా పిండి
  2. 1/8 కప్పు బొంబాయి రవ్వ
  3. చిటికెడు ఉప్పు
  4. 2  చెంచాలు నూనె
  5. నీళ్ళు తగినంత
  6. 1 కప్పు  పచ్చిశనగపప్పు
  7. 200 గ్రాములు బెల్లం తురుము
  8. 200 ml నీళ్లు (పాకం కోసం)
  9. 15 బాదంపప్పులు
  10. 15 పిస్తాపప్పులు
  11. 15 జీడిపప్పులు
  12. ¼ కప్పు పల్లీలు వేయించి
  13. ¼ కప్పు ఎండు కొబ్బరి పొడి
  14. 3-4 ఏలకులు
  15. ¼ కప్పు నెయ్యి

సూచనలు

  1. మైదా పిండి గిన్నెలోకి తీసుకోవాలి.
  2. అందులో చిటికెడు ఉప్పు, నూనె, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలపాలి.
  3. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలి.
  4. పైన తేమ పోకుండా కొద్దిగా నూనె రాసి మూత ఉంచి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  5. పప్పు ని శుభ్రంగా కడిగి అంగుళం పైన వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు ఉడికించాలి.
  6. పప్పు అదే షేప్ లో ఉండాలి కానీ పూర్తిగా ఉడకాలి.మెత్తగా పేస్ట్ లా కాకుండా చూసుకోవాలి.
  7. జీడి పప్పు, బాదం పప్పు,పల్లీ మరియు పిస్తాపప్పు లను దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
  8. ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పును కూడా మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
  9. ఏలకులను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  10. అన్ని పొడులను ఒకే గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి
  11. ఒక బాణలిలో బెల్లం తురుము, నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  12. మరగడం మొదలవగానే, పైన తయారు చెసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.
  13. మిశ్రమం గట్టిగా ముద్దలా అవగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  14. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి.
  15. ఒక్కో ఉండను మైదా లేదా గోధుమ పిండి మధ్యలో ఉంచి చపాతీ లా ఒత్తుకోవాలి.
  16. పెనంలో 2 చెంచాలు ల నెయ్యి వేసి బొబ్బట్లను రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి.
  17. కాల్చడం పూర్తవగానే బొబ్బట్టుని ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి రాయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర