హోమ్ / వంటకాలు / బాదుషా

Photo of BAADUSHA by Kavitha Perumareddy at BetterButter
393
7
0.0(0)
0

బాదుషా

Aug-12-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదుషా రెసిపీ గురించి

ఈ వంటకం పుట్టినరోజులకు,పండుగలకు ఎక్కువగా చేస్తుంటాము. కొంచెం క్రిస్పీగా, లోపల స్మూత్ గా నోటిలో వేసుకుంటే కరిగిపోతూ భలేవుంటాయి. చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా పిండి 1/4 కేజీ
  2. చెక్కర 1/2 కేజీ
  3. నెయ్యి లేదా వెన్న 50 గ్రామ్స్
  4. యాలకులు 6
  5. .బేకింగ్ సోడా 1/4 స్పూన్
  6. ఉప్పు చిటికెడు
  7. పెరుగు 1 కప్
  8. నిమ్మరసం 1/2 స్పున్
  9. నూనె 1/2 కేజీ వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మైదా పిండిని జల్లించి ఒక గిన్నెలో తీసుకుని కరిగించి న నెయ్యి, పెరుగు,సోడాపొడి,చిటికెడు ఉప్పు వేసి అంత బాగా కలపాలి.పిండి కొద్దిగా గట్టిగా ఉంటే నీళ్లు పోసి పూరీ పిండి లాగా కలుపుకోవాలి.
  2. ఈ పిండిని పది నిముషాలు నాననివ్వాలి.
  3. ఇప్పుడు పోయిమీద ఒక గిన్నెలో చెక్కర, కప్ వాటర్ వేసి పాకం పట్టుకోవాలి .తీగె పాకం వస్తే సరిపోతుంది. ముదురుగా వద్దు.ఇప్పుడు యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం వేసి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పిండిని బాగా మర్దనా చేసి చిన్న చిన్న ముద్దాలుగా చేసి అరచేతిలో పెట్టి వత్తుకొని మధ్యలో బొటనవేలితో గుంతలాగా వత్తుకోవాలి.కింద ఫోటో లాగా రెడీ చేసుకోవాలి .
  5. .ఇప్పుడు పోయి మీద బాండీ పెట్టి నూనె వేసుకొని చిన్న మంట మీద వేడిచేయాలి.నూనె ఎక్కువగా కాగవద్దు. ఇప్పుడు నూనెలో బాదుషా లు వేసుకోవాలి ...అవి నెమ్మదిగా కాలుతూ పైకి తేలుతాయి అప్పుడు ఎక్కువ మంట పెట్టి వేయించాలి.రెండు పక్కల తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు మళ్ళీ చిన్న మంట మీద వేయించాలి.
  6. ఇప్పుడు కాలిన బాదుషాలను తీసి పాకంలో వేసి కలిపి 5 నిముసాలు ఉంచాలి .
  7. ఇప్పుడు పాకంలో నుండి తీసి వేరే పళ్ళెంలో వేసుకోవాలి.
  8. అంతే ఇక వేడి వేడి బాదుషా రెడీ ...ఇంకా తినడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర