BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మొక్క జొన్న ఉప్పుడు పిండి

Photo of CORN UPMA by Sandhya Rani Vutukuri at BetterButter
0
1
0(0)
0

మొక్క జొన్న ఉప్పుడు పిండి

Aug-12-2018
Sandhya Rani Vutukuri
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్క జొన్న ఉప్పుడు పిండి రెసిపీ గురించి

మొక్క జొన్న లతో గారెలు, బూరెలు, గింజలు ఉడికించుకోవడం లాంటివి తిని ఉంటాము. కానీ వానా కాలం లో వొచ్చే బుట్టలు ఎంతో రుచిగా, ఎక్కువ పీచు తో బావుంటాయి. వాటిని రుబ్బి దానితో వేయించి చేసే ఆహారం ఈ ఉప్పుడు పిండి. చాలా తేలికగా, రుచిగా, తక్కువ పదార్థాలను ఉపయోగించి చేసే, పెద్దలు-పిల్లలు ఇష్టం గా తినే పూర్తి పోషకాలు ఉన్న ఈ ఆహారం అల్పాహారం గానే కాకుండా, భోజసనం గా కూడా తీసుకోవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మొక్క జొన్న కంకి గింజలు 3కప్పులు(2కంకులు)
  2. పచ్చి మిర్చి 3
  3. ఉప్పు 1 చిన్న చెంచా
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. వెల్లుల్లి రెబ్బలు 2
  6. కరివేపాకులు 2
  7. నూనె 1/2 కప్పు

సూచనలు

  1. లేత, ముదురు కానీ 2 కంకుల గింజలు తీసుకోవాలి.
  2. మిక్సీ లో మిర్చి,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు, గింజలు వేసి తిప్పాలి
  3. మెత్త గా కాకుండా, కొంచెం బరకగా రుబ్బాలి.(పాలు కారే లేత వి వొద్దు)
  4. పొయ్యి పైన మూకుడు పెట్టి, జీలకఱ్ఱ 2 కరివేపాకులు వేసి, వేగాక ఈ ముద్ద వేయాలి.
  5. చిన్న మంట పై ఉంచి, 3 ని.ల తరువాత పూర్తిగా కలియపెట్టాలి
  6. ఇంకో 3 ని.ల తరువాత మళ్ళీ కలిపి దోరగా వేయించు కోవాలి.
  7. చిన్న మంట పైన ఉంచి ఇలా కొంచెం ఎరుపు వచ్చే దాకా కలపండి.
  8. అంతే మీ ఉప్పుడు పిండి తయారు. దీన్ని వేడి పాల తో కానీ, ఉత్త గా కానీ తినవొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర