ఊతప్పం | VUTAPPAM Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • VUTAPPAM recipe in Telugu,ఊతప్పం, Kavitha Perumareddy
ఊతప్పంby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

ఊతప్పం వంటకం

ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VUTAPPAM Recipe in Telugu )

 • 1.ఇడ్లి పిండి ఒక పెద్ద కప్
 • 2.ఉప్పు తగినంత
 • 3.టమాటాలు 2
 • 4.పచ్చిమిర్చి4
 • 5.ఉల్లిగడ్డ ఒకటి పెద్దది
 • 6.క్యారెట్ 1
 • 7.నూనె 3 స్పూన్స్
 • 8.కొత్తిమీర కొద్దిగా
 • 9.క్యాప్సికం 1

ఊతప్పం | How to make VUTAPPAM Recipe in Telugu

 1. ముందుగా కూరగాయలు అన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు ఇడ్లి పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
 3. ఇప్పుడు పోయిమీద దోసె పెంనం పెట్టి వేడి చేసి స్పున్ నూనె వేసి పెనం అంతా పూయాలి.ఇప్పుడు పిండిని వేయాలి .పిండిని పలుచగా రుద్దకూడదు... మందంగా పోసుకోవాలి.
 4. ఇప్పుడు కూరగాయ ముక్కల్ని ,ఊతప్పం మీద పరవాలి.పిండి పచ్చిగా ఉన్నప్పుడే కూరగాయ ముక్కలు చల్లాలి .పైన కొత్తిమీర చల్లాలి.ఊతప్పం మీద ఇంకా కొద్దిగా నూనె వేసి ఒక మూత ఉంచి చిన్న మంట మీద 5 నిముసాలు ఉంచాలి.
 5. తరువాత ఊతప్పం ని పెనంపై తిప్పి వేయాలి .కాసేపు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి.అంతే ఊతప్పం రెడీ...

నా చిట్కా:

ఊతప్పం చిన్న మంట మీద కాలిస్తే కూరగాయలు ఉడికి రుచిగా ఉంటుంది. లేక పోతే మాడిపోతుంది.

Reviews for VUTAPPAM Recipe in Telugu (0)