హోమ్ / వంటకాలు / పనీర్ మసాలా

Photo of PANEER MASALA by Ram Ram at BetterButter
713
1
0.0(0)
0

పనీర్ మసాలా

Aug-13-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ మసాలా రెసిపీ గురించి

పనీర్ కూర చపతిలలో చాలా బాగుంటుంది..చాలా సులభంగా చేసుకోవచ్చు,కమ్మగా వుండి రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పనీర్ 200 గ్రామ్స్
  2. టమాటో 2
  3. బిర్యానీ ఆకు3
  4. దాల్చిన చెక్క 1
  5. ఇలాచి 3
  6. ఎండు మిర్చి 3
  7. పచ్చిమిర్చి 4
  8. జీడిపప్పు 10
  9. గరం మసాలా 1/2స్పూన్
  10. పంచదార1/2స్పూన్
  11. కసూరి మేథీ 1/2స్పూన్
  12. ఉప్పు సరిపడా
  13. కారం
  14. క్రీం 1/2కప్పు
  15. అల్లం ముక్కలు 2స్పూన్లు
  16. వెల్లులి ముక్కలు 2స్పూన్లు
  17. నూనె 6స్పూన్లు

సూచనలు

  1. పాన్ పెట్టి నూనె 3 స్పూన్లు వేసి వేడి అయ్యాక 2కప్పుల టమాటో ముక్కలు,3బిర్యానీ ఆకులు,3 ఎండు మిర్చి ,2పచ్చి మిర్చి,దాల్చిన చెక్క చిన్నది ఒకటి,ఇలాచి 3,అల్లం ముక్కలు 2స్పూన్లు, జీడీ పప్పు 10 వేసి అన్ని బాగా మగ్గనివ్వాలి..
  2. 15 నిమిషాల పాటు మూత పెట్టి చిన్న సెగ మీద మగ్గించాలి..స్టవ్ ఆపి చల్లారనివ్వాలి
  3. ఇప్పుడు మనం చేసిన టమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ రెడి చేసుకోవాలి
  4. ఇప్పుడు వేరే పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పచ్చి మిర్చి ముక్కలు,వెల్లులి ముక్కలు వేసి బాగా వేయించాలి..
  5. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి మనం ముందుగా చేసిన మసాలా పేస్ట్ వేసుకోవాలి..
  6. ఒక 5నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి..
  7. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి..
  8. పనీర్ ముక్కలు కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి..
  9. చివరిగా గరం మసాలా 1/2స్పూన్,కసురి మేథీ,1/2స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి..
  10. ఇప్పుడు 1/2కప్పు క్రీమ్ వేసి అంత బాగా కలుపుకుని 2నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర