పప్పు వడలు(గట్టి వడలు) | Dal vada Recipe in Telugu

ద్వారా Uma Ram  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dal vada recipe in Telugu,పప్పు వడలు(గట్టి వడలు), Uma Ram
పప్పు వడలు(గట్టి వడలు)by Uma Ram
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

పప్పు వడలు(గట్టి వడలు) వంటకం

పప్పు వడలు(గట్టి వడలు) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal vada Recipe in Telugu )

 • శనగపప్పు-1గ్లాసు
 • మినపప్పు-3/4 గ్లాసు
 • కరివేపాకు-గుప్పెడు
 • మిరియాలు-1/4 స్పూన్
 • ఎండుమిరప కాయలు- 10
 • పచ్చిమిరప కాయలు- 9
 • ఇంగువ-చిటికెడు
 • అల్లం-నిమ్మకాయంత
 • ఉప్పు- తగినంత
 • నూనె - 1లీటరు

పప్పు వడలు(గట్టి వడలు) | How to make Dal vada Recipe in Telugu

 1. 1. మొదట శనగపప్పు, మినపప్పు బాగా కడగాలి. 2. కడిగినపప్పులను నీటిలో 1 గంట నాన బెట్టాలి. 3. నానాక రెండు పప్పులనూ కలిపి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండరులో రుబ్బుకోవాలి. 4. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి,మిరియాలు,కరివేపాకు,ఇంగువ,అల్లం ,ఉప్పుమిక్సీలో మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి. 5. ఈ పేస్టును రుబ్బుకొన్న పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. 6. ఇప్పుడు దీనిని పాలిథిన్ కవర్ మీద పల్చగా వడలు తట్టి నూనెలో వేయించాలి. 7. బాగా వేగాక తీసి టిష్యూ పేపర్ పైన వేసుకొంటే నూనె పీల్చుకొంటుంది.

నా చిట్కా:

ఈ వడలు వేసేటప్పుడు పల్చగా తట్టుకోవాలి. లావుగా తట్టితే నిలువ ఉండవు. వేగేటప్పుడు కొంచెం మీడియం మంటలో పెట్టాలి.

Reviews for Dal vada Recipe in Telugu (0)