హోమ్ / వంటకాలు / బెండకాయ పులుసు కూర

Photo of BENDAKAYA pulusu kural by Kavitha Perumareddy at BetterButter
934
0
0.0(0)
0

బెండకాయ పులుసు కూర

Aug-13-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పులుసు కూర రెసిపీ గురించి

బెండకాయ పులుసు అనగానే చాలా కష్టం మసాలాలు చేసుకోవాలి అది ఇది అనుకుంటారు.కానీ ఇలా చేసుకుంటే చాలా సులభం .ఇక మసాలాలు కూడా ఎక్కువ వాడకుండా చేస్తాం. పాతకాలంలో మా పెద్దలు ఇలా మసాలాలు ఎక్కువ వాడకుండా చేస్తారు. ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. బెండకాయ లు పావుకేజీ
  2. టమాటాలు 2
  3. .పచ్చిమిర్చి3
  4. ఉల్లిపాయ 1 పెద్దది
  5. నూనె 1పెద్ద స్పున్
  6. కారం టీ స్పూన్
  7. పసుపు అరస్పూన్
  8. ఉప్పు తగినంత
  9. ధనియాలు పొడి చిన్న స్పున్
  10. కొబ్బరిపొడి 2 స్పూన్స్
  11. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పున్
  12. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్
  13. పోపుగింజెలు1స్పున్
  14. కరేపాకు కొద్దిగా
  15. కొత్తిమీర గుప్పెడు

సూచనలు

  1. ముందుగా కూరగాయలు కడిగి చిన్న ముక్కలుగా తరగాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి వేడి చేసి పోపుగింజెలు వేసి వేగినతారువాత, కరివేపాకు కూడా వేసుకోవాలి
  3. ఇప్పుడు తాలింపులో ముందుగా ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించాలి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి టమాటా ముక్కలు వేసుకొని కాసేపు మగ్గించాలి.
  4. ఇప్పుడు బెండకాయలు ,తగినంత ఉప్పు వేసి బెండకాయ మగ్గే వరకు ఉండి దానిలో పసుపు,కారం,ధనియాలు పొడి,కొబ్బరిపొడి వేసి కలపాలి.
  5. అంతా బాగా కలిపిన తరువాత చింతపండు నానబెట్టి రసం తీసి పోయాలి. గ్లాస్ ఉంటే సరిపోతుంది రసం.ఇప్పుడు 5 నిముసాలు ఉడికించాలి.
  6. కూర ఉడికిన తరువాత కొత్తిమీర చల్లు కోవాలి. అంతే చాలా రుచిగా వుండే బెండకాయ పులుసు కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర