హోమ్ / వంటకాలు / బీరకాయ శనగపప్పు కూర..

Photo of Ridge gourde and chana daal curry by Shobha.. Vrudhulla at BetterButter
1027
1
0.0(0)
0

బీరకాయ శనగపప్పు కూర..

Aug-14-2018
Shobha.. Vrudhulla
600 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ శనగపప్పు కూర.. రెసిపీ గురించి

అన్నంతోని కానీ రొట్టెలతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బిరకాయలు 1/2కిలో
  2. .శనగపప్పు 3/4 కప్పు
  3. ఉల్లిపాయలు మాములు సైజ్వి 3
  4. టమాటో మాములు సైజ్ వి 4
  5. వెల్లుల్లిపాయలు వాలిచినవి 10చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి
  6. అల్లం వెల్లుల్లి ముద్ద 1చెంచా
  7. పచ్చిమిరపకాయలు 3 నిలువుగా చిన్న గంటు పెట్టి ఉంచుకోవాలి
  8. కరివేపాకు రెండు రెబ్బలు..
  9. ఉప్పు తగినంత.
  10. పసుపు చిటికెడు
  11. కారము 2 చెంచాలు లేక ఎక్కువ కావాలి కారము అంటే యింకా ఎక్కువ వేయొచ్చు
  12. ధనియాల గుండా 2 చెంచాలు
  13. గరం మసాలా గుండా 1 చెంచా
  14. జీలకర్ర గుండా 1/2 చెంచా
  15. పోపుకి ఆవాలు మరియు జీలకర్ర.
  16. నూనె 1/2 కప్ప్పు

సూచనలు

  1. ముందుగా సనగాఒప్పుని 2గంటలు వరకు నానపెట్టాలి..
  2. అన్నీరేడీ చేసుకొని బిరకాయలు తొక్క తీసి మనకి కావలసిన ఆకారంలో తరిగి ఉంచుకోవలెను..
  3. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి ముందుగా తరిగి ఉంచిన వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక కరివేపాకు మిరపకాయలు వేసి వేగనివ్వాలి.
  4. వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చక్కగా గోధుమరంగులో వొచెదక వేగనివ్వాలి..
  5. యిది వేగాక టమాటాలుకి గ్రైండ్ చేసి ఆ ముద్దని వేగిన ఉల్లిపాయల్లో వేసి బాగా వేగనివ్వాలి..
  6. .యిప్పుడు ఆ వేగిన ముద్దలో పసుపు ... కారము...ధనియాల గుండా...జీలకర్ర గుండా..గరం మసాలా గుండా మరియు ఉప్పు వేసి బాగా కలపాలి..
  7. ఇప్పుడు బాగా వేగి నూనె కాస్త వదులుతున్నప్పుడు నానపెట్టి ఉంచిన సంసాగపప్పు బీరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి అంతా..
  8. .2నిమిషాలు అలా కలిపిన తరువాత అప్పుడు కొంచెం నీళ్లు పోసి మూతపెట్టాలి..
  9. .3 సార్లు విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేసేయటమే..ఎక్కువగా విజిల్స్ వస్తే శనగపప్పు లేహ్యముగా అయిపోతుంది ఆలా బాగుండదు కనుక వేగంగానే ఆర్పేయాలి...
  10. చల్లారేక మూత తీసి చూడండి..ఒకవేళ నీరు ఉంటే యింకపెట్టి అప్పుడు ఒక బౌల్ లో తీసి కొత్తిమీర వేసుక్కని రొట్టెలతో కానీ అన్నము తో కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర