బీరకాయ శనగపప్పు కూర.. | Ridge gourde and chana daal curry Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  14th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ridge gourde and chana daal curry recipe in Telugu,బీరకాయ శనగపప్పు కూర.., Shobha.. Vrudhulla
బీరకాయ శనగపప్పు కూర..by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

About Ridge gourde and chana daal curry Recipe in Telugu

బీరకాయ శనగపప్పు కూర.. వంటకం

బీరకాయ శనగపప్పు కూర.. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourde and chana daal curry Recipe in Telugu )

 • బిరకాయలు 1/2కిలో
 • .శనగపప్పు 3/4 కప్పు
 • ఉల్లిపాయలు మాములు సైజ్వి 3
 • టమాటో మాములు సైజ్ వి 4
 • వెల్లుల్లిపాయలు వాలిచినవి 10చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి
 • అల్లం వెల్లుల్లి ముద్ద 1చెంచా
 • పచ్చిమిరపకాయలు 3 నిలువుగా చిన్న గంటు పెట్టి ఉంచుకోవాలి
 • కరివేపాకు రెండు రెబ్బలు..
 • ఉప్పు తగినంత.
 • పసుపు చిటికెడు
 • కారము 2 చెంచాలు లేక ఎక్కువ కావాలి కారము అంటే యింకా ఎక్కువ వేయొచ్చు
 • ధనియాల గుండా 2 చెంచాలు
 • గరం మసాలా గుండా 1 చెంచా
 • జీలకర్ర గుండా 1/2 చెంచా
 • పోపుకి ఆవాలు మరియు జీలకర్ర.
 • నూనె 1/2 కప్ప్పు

బీరకాయ శనగపప్పు కూర.. | How to make Ridge gourde and chana daal curry Recipe in Telugu

 1. ముందుగా సనగాఒప్పుని 2గంటలు వరకు నానపెట్టాలి..
 2. అన్నీరేడీ చేసుకొని బిరకాయలు తొక్క తీసి మనకి కావలసిన ఆకారంలో తరిగి ఉంచుకోవలెను..
 3. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి ముందుగా తరిగి ఉంచిన వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక కరివేపాకు మిరపకాయలు వేసి వేగనివ్వాలి.
 4. వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చక్కగా గోధుమరంగులో వొచెదక వేగనివ్వాలి..
 5. యిది వేగాక టమాటాలుకి గ్రైండ్ చేసి ఆ ముద్దని వేగిన ఉల్లిపాయల్లో వేసి బాగా వేగనివ్వాలి..
 6. .యిప్పుడు ఆ వేగిన ముద్దలో పసుపు ... కారము...ధనియాల గుండా...జీలకర్ర గుండా..గరం మసాలా గుండా మరియు ఉప్పు వేసి బాగా కలపాలి..
 7. ఇప్పుడు బాగా వేగి నూనె కాస్త వదులుతున్నప్పుడు నానపెట్టి ఉంచిన సంసాగపప్పు బీరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి అంతా..
 8. .2నిమిషాలు అలా కలిపిన తరువాత అప్పుడు కొంచెం నీళ్లు పోసి మూతపెట్టాలి..
 9. .3 సార్లు విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేసేయటమే..ఎక్కువగా విజిల్స్ వస్తే శనగపప్పు లేహ్యముగా అయిపోతుంది ఆలా బాగుండదు కనుక వేగంగానే ఆర్పేయాలి...
 10. చల్లారేక మూత తీసి చూడండి..ఒకవేళ నీరు ఉంటే యింకపెట్టి అప్పుడు ఒక బౌల్ లో తీసి కొత్తిమీర వేసుక్కని రొట్టెలతో కానీ అన్నము తో కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది..

నా చిట్కా:

వెల్లుల్లి ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేస్టున్నాం.

Reviews for Ridge gourde and chana daal curry Recipe in Telugu (0)