నిమ్మకాయ పులిహర | Lemon rice Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  15th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lemon rice recipe in Telugu,నిమ్మకాయ పులిహర, Dharani Jhansi Grandhi
నిమ్మకాయ పులిహరby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

నిమ్మకాయ పులిహర వంటకం

నిమ్మకాయ పులిహర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon rice Recipe in Telugu )

 • 1 కప్పు వుడికించిన అన్నం
 • 6 నిమ్మకాయలు పెద్దవి
 • ఉప్పు రుచికి సరిపడా
 • 2 ఎండు మిరపకాయలు
 • 2 పచ్చి మిరపకాయలు
 • 1 రెమ్మ కర్వేపాకు
 • నూనె ఒక 100 గ్రా
 • 1 చెంచా తాలింపు దినుసులు ( ఆవాలు ,జీలకర్ర )
 • 1 చెంచా మినపప్పు
 • 1 చెంచా సెనెగ పప్పు
 • 2 చెంచాలు వేరుశెనిగ గుళ్ళు

నిమ్మకాయ పులిహర | How to make Lemon rice Recipe in Telugu

 1. ముందుగా వుడికించిన్న అన్నం చల్లార్చుకొని దాంట్లో కొద్దిగా నూనె , ఉప్పు , పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోండి .
 2. ఒక మూకుడు పెట్టుకొని కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు , సేనిగె పప్పు, వేరు సెనెగ గుళ్ళు , కరివేపాకు , ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి తాలింపు పెట్టుకోండి.
 3. ఇలా తయారు చేసుకొన్నా తాలింపుని కాస్త చల్లార్చు కొని పసుపు, ఉప్పు, నిమ్మరసం కలుపుకున్న అన్నం లోకి వేసుకొని అంత బాగా కలపండి .
 4. ఆఖరిన కాస్త కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ .

నా చిట్కా:

కొంచెం జీడి పప్పుa కూడా వేయించి కలుపుకోవచ్చు.

Reviews for Lemon rice Recipe in Telugu (0)