కరివేపాకు పొడి | Curry leaves powder Recipe in Telugu

ద్వారా Uma Ram  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Curry leaves powder recipe in Telugu,కరివేపాకు పొడి, Uma Ram
కరివేపాకు పొడిby Uma Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

కరివేపాకు పొడి వంటకం

కరివేపాకు పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Curry leaves powder Recipe in Telugu )

 • కరివేపాకు- 3కట్టలు
 • ఎండుమిరప కాయలు - 10 లేక 12
 • ఉప్పు- 1 స్పూన్
 • ఆవాలు - 1 స్పూన్
 • ధనియాలు -1 స్పూన్
 • మినప్పప్పు -1 1/2 స్పూన్
 • మెంతులు - 1/2 స్పూన్
 • ఇంగువ - చిటికెడు
 • నిమ్మకాయ - 1

కరివేపాకు పొడి | How to make Curry leaves powder Recipe in Telugu

 1. 1.కరివేపాకు ఆకులు తుంచి శుభ్రంగా కడిగి 2 రోజులు నీడలో ఆరబెట్టాలి. 2. ఆరాక ఉత్త బాణలిలో కరివేపాకు వేసి వేడి చెయ్యాలి. 3. తరువాత బాణలిలో ఒక స్పూన్ నూనె వేసివరుసగాఆవాలు,మెంతులు,మినప్పప్పు,ధనియాలు,ఎండుమిరపకాయలు,ఇంగువ వేసి వేయించుకోవాలి. 4. చల్లారాక మొదట కరివేపాకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 తరువాత వేయించుకున్నవన్నీ పొడి చేసుకొని దానితోబాటు కరివేపాకు పొడి,ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. 6. ఆపొడిలో నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి.

నా చిట్కా:

కరివేపాకు వేయించేటపుడు సన్నటి సెగ మీద పూర్తిగా తడి ఆరిపోయే వరకు వేయించాలి. అప్పుడే నిలువ ఉంటుంది.

Reviews for Curry leaves powder Recipe in Telugu (0)