BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దోసకాయ మూక్కల పచ్చడి

Photo of Yellow cucumber chutney by Sukriti Siri at BetterButter
0
0
0(0)
0

దోసకాయ మూక్కల పచ్చడి

Aug-17-2018
Sukriti Siri
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ మూక్కల పచ్చడి రెసిపీ గురించి

దోసకాయ ముక్కల పచ్చడి కొంచెం పుల్లగా మరియు కారంగా ఉండే పచ్చడి. ఇది వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది. తయారు చేసిన వెంటనే తిన వచ్చు ఊరబెట్టాల్సిన అవసరం లేకుండా. వీలైతే రోట్లో నూరి తయారు చేసుకుంటే రుచి మరింత ఆమోఘముగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1/2 కిలో : దోసకాయ
  2. 1 చెంచా : నూనె
  3. 3 చెంచాలు : మినపప్పు
  4. 1 చెంచా : మెంతులు
  5. 1 చెంచా : ఆవాలు
  6. 1/8 చెంచా : ఇంగువ
  7. ఉసిరికాయ అంత చింతపండు
  8. 5 : పచ్చి మిరపకాయాలు
  9. 1 : ఎండు మిరపకాయ
  10. కొంచెం కొత్తిమీరు
  11. 1/4 చెంచా : పసుపు
  12. ఉప్పు తగినంత
  13. పోపు కి : 1 చెంచా : ఆవాలు, జీలకర్ర
  14. 1 : ఎండు మిరపకాయ
  15. కొన్ని : కరివేపాకులు
  16. 1 చెంచా : మినపప్పు
  17. 1 చెంచా : నూనె

సూచనలు

  1. దోసకాయ తొక్క తీసి సగానికి కోసి గింజాలు వేరు చేసుకోండి.
  2. దోసకాయ, గింజలు విడి విడి గా రుచి చూసి చేదు గా ఉన్నవి పారేసి , చేదు లేని దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.
  3. ఒక చిన్న మూకుడు పెట్టి ఒక చెంచా నూనె వేసుకొని మినపప్పు, మెంతులు దోరగా వేయించి ఆవాలు వేసుకొని చిటపట లాడానివ్వండి.
  4. పచ్చి మరియు ఎండు మిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించి , ఇంగువ కూడా వేసి కదిలించి దీనిని కాస్త చాల్లార్చుకోండి.
  5. ఇప్పుడు మిక్సీలో దోసకాయ గింజలు,వేయించుకున్నవి, చింతపండు, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోండి.
  6. దోసకాయ ముక్కల్లో రుబ్బుకున్న మిశ్రమం వేసి చేత్తో బాగా కలుపుకోండి అప్పుడు ముక్కలకు మసాలా అంటుకొని బాగా రుచికి ఉంటుంది.
  7. పోపు మూకిటీలో నూనె వెసుకొని, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయ ముక్కల తో పోపు పెట్టి పచ్చడిలో వేసి కలుపుకుంటే దోసకాయ ముక్కలు పచ్చడి ఆరగించటానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర