హోమ్ / వంటకాలు / దద్దోజనం

Photo of Daddojanam by Sree Sadhu at BetterButter
910
1
0.0(0)
0

దద్దోజనం

Aug-17-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దద్దోజనం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు లేకపోతే ఏమి చేయలేకపోతున్నప్పుడు ఇటువంటివి సులువుగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం - అరకప్పు
  2. నీళ్లు - ఒకటిన్నర కప్పులు
  3. పెరుగు - ఒక కప్పు
  4. పాలు - పావు కప్పు
  5. పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు
  6. అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్‌
  7. ఆవాలు - ముప్పావు టీస్పూన్‌
  8. పచ్చి శెనగపప్పు - ముప్పావు టీస్పూన్‌
  9. మినపప్పు - అర టీస్పూన్‌
  10. కరివేపాకులు - కొన్ని
  11. ఇంగువ - చిటికెడు
  12. నూనె - రెండు టీస్పూన్లు
  13. ఎండుమిర్చి - రెండు
  14. మిరియాలు 3-4

సూచనలు

  1. బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. 
  2. అన్నాన్ని గరిటెతో కొద్దిగా మెత్తగా చేయాలి.
  3. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి కలిపి చల్లారనివ్వాలి
  4. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. 
  5. పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, మిరియాలు ,అల్లం, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి. 
  6. తాలింపును పెరుగన్నంలో వేసి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర