హోమ్ / వంటకాలు / కట్టే పొంగళి

Photo of Ven pongal by Sukriti Siri at BetterButter
680
2
0.0(0)
0

కట్టే పొంగళి

Aug-17-2018
Sukriti Siri
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టే పొంగళి రెసిపీ గురించి

కట్టే పొంగళి ప్రాచీన ఫలహారం. గుడిలో దేవుడికి ప్రసాదం మాదిరి గాను ఎక్కిస్తారు. పప్పు, బియ్యం, అల్లం, మిరియాలు వేసి చేసుకునే ఈ వంటకం ఎంతో తేలికగా తయారవుతుంది మరియు ఎంతో రుచిగా ఉంటుంది. సంక్రాంతి రోజు కొత్త కుండలో కొత్త పంట తో పొలం లో వండుకొని తినటం సాంప్రదాయంగా వస్తోంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 గ్లాస్ : బియ్యం
  2. 1/2 గ్లాస్ : పెసర పప్పు
  3. 2 చెంచాల : నెయ్యి
  4. 4 గ్లాసుల : మంచి నీరు
  5. ఉప్పు తగినంత
  6. పోపు కి : 1 పెద్ద చెంచా : నెయ్యి
  7. 1 చెంచా : జీలకర్ర
  8. 1/2 చెంచా : మిరియాలు
  9. 1 చెంచా : మిరియాల పొడి
  10. 2 : పచ్చి మిరపకాయలు
  11. 1/8 చెంచా : ఇంగువ
  12. 1 చెంచా : తరిగిన అల్లం
  13. కరివేపాకులు కొన్ని
  14. నీళ్లు పొంగళి గట్టిగా ఉంటే

సూచనలు

  1. పప్పు, బియ్యం శుభ్రం చేసుకుని బాగా కడిగి పెడుకోండి
  2. కుక్కర్ లో రెండు చెంచాల నెయ్యి వేసి కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం వేసుకొని బియ్యం తెల్ల బడి పప్పు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
  3. నీళ్లు పోసి 4 నుండి 5 కూతలు వచ్చే వరకు ఉడికించి స్టీమ్ పోయే వరకు పక్కన ఉంచుకోండి.
  4. పోపు మూకిటీలో ఒక చెంచా నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, మిరియాల పొడి, తరిగిన అల్లం, పచ్చి మిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు తో పోపు పెట్టుకోండి.
  5. కుక్కర్ మూత తీసి ఉప్పు కొన్ని నీళ్లు పోసి కలుపుకొని తయారు చేసుకున్న పోపు వేసుకొని కలుపుకుంటే కట్టే పంగలి తయారు.
  6. కొబ్బరి పుట్నాల పచ్చడి తో లేదా పచ్చి పిలుసు తో తింటే ..ఆహా !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర