హోమ్ / వంటకాలు / మైసూర్ రసం

Photo of Mysore rasam by Sukriti Siri at BetterButter
638
1
0.0(0)
0

మైసూర్ రసం

Aug-17-2018
Sukriti Siri
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ రసం రెసిపీ గురించి

మైసూర్ రసం ఎంతో తేలికైన రసం వంటకం. తాజాగా నూరుకున్న కొబ్బరి మరియు దినుసుల మశాల తో చేస్తారు. సాధారణంగా రసం లో కొబ్బరి వాడరు కానీ దీని ప్రత్యేకతే అది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. 1/4 కప్పు : కంది పప్పు
  2. మశాల ముద్దకి : 1 చెంచా : చెనగ పప్పు
  3. 1 చెంచా : ధనియాలు
  4. 1 : ఎండు మిరపకాయ
  5. 6 : మిరియాలు
  6. 2 చెంచాల : కొబ్బరి పొడి
  7. 1 చెంచా : నెయ్యి
  8. 1 కప్ : పల్చటి చింత పండు రసం
  9. 1/4 చెంచా : ఇంగువ
  10. కరివేపాకులు కొన్ని
  11. నీళ్లు సరిపడా
  12. ఉప్పు తగినంత
  13. 1/4 చెంచా : పసుపు
  14. కోత్తిమీరు కొద్దిగా
  15. పోపు కి : 1 చెంచా : నెయ్యి
  16. 1 చెంచా : ఆవాలు
  17. 1 చెంచా : జీలకర్ర
  18. ఇంగువ చిటికెడు
  19. 1 : ఎండు మిరపకాయ

సూచనలు

  1. ముందుగా కందిపప్పు ని శుభ్రం చేసి కుక్కర్ లో మెత్తగా ఉడికించి కవ్వం గుత్తి తో ఏనుపుకొని పెట్టుకోండి.
  2. పోపు మూకిటీలో ఒక చెంచా నెయ్యి వేసి చెనగ పప్పు, ధనియాలు, మిరియాలు, ఎండు మిరపకాయ,కొబ్బరి వేసి పప్పు బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోండి.
  3. కాస్త చల్లార్చుకొని మిక్సీ లో మెత్తగా ఒక చెంచా నీళ్లు పోసి రుబ్బు కోండి.
  4. ఒక గిన్నెలో చింత పండు రసం, ఇంగువ, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు మరగించండి.
  5. ఇప్పుడు ఉడికించి ఏనుపుకున్న పప్పు ,రుబ్బిన మశాల వేసి కలుపుకోండి.
  6. సరిపడ నీళ్లు పోసి రసం లాగా పలుచగా చేసుకోండి.
  7. కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు మరగించండి.
  8. ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయ, ఇంగువ తో పోపు పెట్టి మారుగుతున్న రసం లో పోసుకుంటే ఘుమ ఘుమ లాడే మైసూర్ రసం రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర