హోమ్ / వంటకాలు / బెండకాయ నువ్వులపొడి వేసిన కూర

Photo of Ladyfinger with  seasam (Tilly)powder cury by Shobha.. Vrudhulla at BetterButter
422
2
0.0(0)
0

బెండకాయ నువ్వులపొడి వేసిన కూర

Aug-17-2018
Shobha.. Vrudhulla
300 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ నువ్వులపొడి వేసిన కూర రెసిపీ గురించి

బెండకాయ నువ్వులపొడి వేసి చేసిన కూర స్వచ్ఛమైన తెలుగు వంటకం..అన్నాముతో తింటే చాలా రుచిగా ఉంటుంది..కొవ్వుపదార్ధాలు కూడా లేవు.బెండకాయ నువ్వులు రెండు కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకయలు అరకిలో తీసుకోవాలి.
  2. చింతపండు పిడికెడు.
  3. ఉప్పు తగినంత
  4. పసుపు అరా చెంచా చిన్న సైజ్ ది
  5. నూనె 2 చంచలు.
  6. మినగపప్పు ఒక చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. ఎండు మిరపకాయలు రెండు
  9. పచ్చి మిరపకాయలు రెండు
  10. కరివేపాకు రెండు రెబ్బలు
  11. నువ్వులపొడి ఐదు చంచలు..

సూచనలు

  1. ముందుగా బెండకయలు బాగా కడిగి తుడిచి తరుక్కోవలెను
  2. ఆతరువాత ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో చింతపండు..ఉప్పు..పసుపు వేసి ఒక మరుగు వచ్చేదాకా ఉంచి అప్పుడు తరిగిన బెండకయలు వేయవలెను
  3. అవి బాగా ఉదకటం మొదలయక స్టవ్ తగ్గించి ఉడకనివ్వాలి
  4. ఐదు నిముషాలు ఉడికాక స్టవ్ ఆర్పేసీ కూరని ఒక చల్ని లో వార్చేయాలి.ఎక్కువసేపు ఊడికితే మరి మెత్తగ అయిపోతాయి కాబట్టి కాస్త ఉడికేసరికి తీసేయవలెను..
  5. కూర చల్లారేక పోపు వేయవలెను.
  6. స్టవ్ మీద ముకుడు పెట్టి అందులో నూనెవేసి కాగాక దానిలో మినగపప్పు...ఇంగువ..ఎండు మిరపకాయలు ...పచ్చి మిర్చి...కరివేపాకు.. వేసి బాగా వేశక ఉడికి వార్చి ఉంచిన కూరని చింతపండు వేరు చేసి యి వేగిన పోపులో వేసి బాగా కింద మీద కలిపిన తరువాత అందులో ముందుగా చేసి ఉంచిన నువ్వులపొడి వేసి బాగా కాలియపెట్టాలి అంతే బెండకాయ నువ్వులపొడి కూర తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర