బెండకాయ నువ్వులపొడి వేసిన కూర | Ladyfinger with seasam (Tilly)powder cury Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ladyfinger with seasam (Tilly)powder cury recipe in Telugu,బెండకాయ నువ్వులపొడి వేసిన కూర, Shobha.. Vrudhulla
బెండకాయ నువ్వులపొడి వేసిన కూరby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  5

  గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

బెండకాయ నువ్వులపొడి వేసిన కూర వంటకం

బెండకాయ నువ్వులపొడి వేసిన కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ladyfinger with seasam (Tilly)powder cury Recipe in Telugu )

 • బెండకయలు అరకిలో తీసుకోవాలి.
 • చింతపండు పిడికెడు.
 • ఉప్పు తగినంత
 • పసుపు అరా చెంచా చిన్న సైజ్ ది
 • నూనె 2 చంచలు.
 • మినగపప్పు ఒక చెంచా
 • ఇంగువ చిటికెడు
 • ఎండు మిరపకాయలు రెండు
 • పచ్చి మిరపకాయలు రెండు
 • కరివేపాకు రెండు రెబ్బలు
 • నువ్వులపొడి ఐదు చంచలు..

బెండకాయ నువ్వులపొడి వేసిన కూర | How to make Ladyfinger with seasam (Tilly)powder cury Recipe in Telugu

 1. ముందుగా బెండకయలు బాగా కడిగి తుడిచి తరుక్కోవలెను
 2. ఆతరువాత ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో చింతపండు..ఉప్పు..పసుపు వేసి ఒక మరుగు వచ్చేదాకా ఉంచి అప్పుడు తరిగిన బెండకయలు వేయవలెను
 3. అవి బాగా ఉదకటం మొదలయక స్టవ్ తగ్గించి ఉడకనివ్వాలి
 4. ఐదు నిముషాలు ఉడికాక స్టవ్ ఆర్పేసీ కూరని ఒక చల్ని లో వార్చేయాలి.ఎక్కువసేపు ఊడికితే మరి మెత్తగ అయిపోతాయి కాబట్టి కాస్త ఉడికేసరికి తీసేయవలెను..
 5. కూర చల్లారేక పోపు వేయవలెను.
 6. స్టవ్ మీద ముకుడు పెట్టి అందులో నూనెవేసి కాగాక దానిలో మినగపప్పు...ఇంగువ..ఎండు మిరపకాయలు ...పచ్చి మిర్చి...కరివేపాకు.. వేసి బాగా వేశక ఉడికి వార్చి ఉంచిన కూరని చింతపండు వేరు చేసి యి వేగిన పోపులో వేసి బాగా కింద మీద కలిపిన తరువాత అందులో ముందుగా చేసి ఉంచిన నువ్వులపొడి వేసి బాగా కాలియపెట్టాలి అంతే బెండకాయ నువ్వులపొడి కూర తయారు.

నా చిట్కా:

ఇదేరకంగా అంతా యిదే పద్దతిలో చేసి ఆఖరిలో నువ్వులపొడి బదులు మేంటిపొడి వేడి బెండకాయ మేంటికురా కూడా చేయొచ్చు.

Reviews for Ladyfinger with seasam (Tilly)powder cury Recipe in Telugu (0)