హోమ్ / వంటకాలు / ములక్కాడ సాంబారు

Photo of Drumstick Sambar by Sukriti Siri at BetterButter
695
4
0.0(0)
0

ములక్కాడ సాంబారు

Aug-18-2018
Sukriti Siri
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ములక్కాడ సాంబారు రెసిపీ గురించి

సాంబారు ఒక సాంప్రదాయిక వంటకం. వందకు పైగా సంవత్సారాలుగా అన్ని వర్గాల వారు విరివిగా పలు కూరగాయలు , పప్పు దినుసులు వాడి చేసుకుంటున్నారు. పలు పలహారల లోకి మరియు అన్నం లోకి కూడా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిలకడం
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1/2 కప్పు : కందిపప్పు
  2. 50 గ్రా : చింతపండు
  3. 2 : ములక్కాడలు పెద్దవి
  4. 2 : బంగాళా దుంపలు
  5. 1 : కారెట్
  6. 10 : చిరుల్లి
  7. 10 : ఆనపకాయ ముక్కలు
  8. 2 : పచ్చి మిరపకాయలు
  9. 2 : ఎండు మిరపకాయలు
  10. 2 రెమ్మలు : కరివేపాకు
  11. 1/4 చెంచా : పసుపు
  12. ఉప్పు తగినంత
  13. చిన్న ముక్క : బెల్లము
  14. 1/2 కప్పు : కొత్తిమీర
  15. నీళ్లు సరిపడా
  16. సాంబారు మసాలా కి : 2 చెంచాలు : సెనెగ పప్పు
  17. 2 చెంచాలు : ధనియాలు
  18. 4 : ఎండు మిరపకాయలు
  19. 1 చెంచా : జీలకర్ర
  20. 6 : మిరియాలు
  21. 1/8 చెంచా : ఇంగువ
  22. 1 చెంచా : ఎండు కొబ్బరి
  23. 1 చెంచా : నెయ్యి
  24. పోపు కి కావాల్సినవి : 2 చెంచాల : నెయ్యి
  25. 1 చెంచా : నూనె
  26. 1 చెంచా : ఆవాలు
  27. 1 చెంచా : జీలకర్ర
  28. 1 : ఎండు మిరపకాయ
  29. చిటికెడు : ఇంగువ

సూచనలు

  1. సాంబారు చేసుకునే ముందు మసాలా పొడి సిద్ధం చేసుకుందాం. అందుకు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక చెంచాడు నెయ్యి వేసి వరుసగా సెనెగె పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసుకొని దోరగా వేయించుకుని చాల్లార్చుకోండి.
  2. చల్లారని తరువాత మిక్సీ లో వేసుకొని, కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దను రుబ్బి పెట్టుకోండి.
  3. ఇక సాంబారు విషయానికి వస్తే చింతాపండుని 15 నిమిషాల పాటు నీళ్లలో నాన బెట్టుకొని చిక్కటి రసం తీసుకొని పిప్పి ని వేరు చేసుకోండి.
  4. కందిపప్పు ని శుభ్రం చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా , నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి.
  5. కుక్కర్ చల్లారిన తరువాత పప్పు గుత్తి తో ఏనుపుకొని పెట్టుకోండి.
  6. ఒక లోతైన మూకుడు లేదా గిన్నెలో చింతపండు రసం, పసుపు,ఉప్పు, బెల్లం, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు మరియు 3 గ్లాసుల నీళ్లు వేసుకోండి.
  7. తరిగి పెట్టుకున్న బంగాళా దుంప, ముల్లకాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు ,ఆనపకాయ ముక్కలు, చిరుల్లి కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి.
  8. ముక్కలు ఉడికెంత వరకు మూత పెట్టుకొని మరిగించుకోండి.
  9. కూరలు కాస్త మెత్తబడ్డాక ఉడికించి ఏనుపుకున్న పప్పుని మరియు రుబ్బి పెట్టుకున్న సాంబారు మసాల ముద్దని కూడా వేసి కలుపుకొని మరో 8 నుండి 10 నిమిషాల పాటు మరగించండి.
  10. చివరిగా పోపు గిన్నెలో నెయ్యి, నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయ, ఇంగువ తో పోపు పెట్టుకొని మారుగుతున్న సాంబారు లో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది.
  11. ఎంతో శ్రేష్ఠమైన ముల్లకాడ సాంబారు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర