రైల్ ఫలహారం | Steamed rice balls with spicy seasoning Recipe in Telugu

ద్వారా Sukriti Siri  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Steamed rice balls with spicy seasoning recipe in Telugu,రైల్ ఫలహారం, Sukriti Siri
రైల్ ఫలహారంby Sukriti Siri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

5

0

రైల్ ఫలహారం వంటకం

రైల్ ఫలహారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Steamed rice balls with spicy seasoning Recipe in Telugu )

 • 4 కప్పులు : వరిపిండి
 • 2 కప్పులు : నీళ్లు
 • 1 చెంచా : ఉప్పు
 • 1 చెంచా : నూనె
 • 1/2 కప్పు : పెసర పప్పు
 • 2 : ఉల్లిపాయలు (మధ్య రకం)
 • సగం చిప్ప : పచ్చి కొబ్బరి
 • 6-8 : పచ్చి మిరపకాయలు
 • 1 గరిట : నూనె
 • 1 చెంచా : జీలకర్ర
 • 1 చెంచా : ఆవాలు
 • 2 రెమ్మలు : కరివేపాకు
 • 1/2 చెంచా : పసుపు
 • 1 గుప్పెడు : కొత్తిమీర
 • ఉప్పు రుచికి సరిపడా
 • 3-4 పెద్ద చెంచాల : నిమ్మరసం

రైల్ ఫలహారం | How to make Steamed rice balls with spicy seasoning Recipe in Telugu

 1. పిండి ఉప్పటానికి : రెండు కప్పుల నీళ్లు , ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా నూనె వేసుకొని మరగించండి.
 2. మరుగుతున్న నీళ్లలో 4 కప్పుల వరిపిండి వేసుకొని బాగా కలిపి , మూత పెట్టి, పొయ్యి ఆర్పేయండి.
 3. ఒక పది నిమిషాల తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి పిండి ముద్ద ని తయారు చేసుకోండి.
 4. కొంచెం కొంచెం పిండి ని వేరు చేసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోండి. దాదాపు రేగు పండు సైజులో.
 5. ఇలాగే పూర్తి గా ఉప్పిన పిండి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక లోతు గిన్నెలోకి వేసుకోండి.
 6. ఈ ఉండలు చేయటానికి కాస్త సమయం పట్టినా చూడటానికి , తినటానికి ఎంతో అందంగా ఉంటాయి.
 7. ఇప్పుడు ఈ ఉండలని ఆవిరి ఉడికించి పెట్టుకోండి.
 8. సగం కప్పు పెసరపప్పు శుభ్రం చేసుకుని సరిపడా నీళ్లు పోసుకొని అరగంట పాటు నాన బెట్టుకొని మెత్తటి ముద్ద చేసి పెట్టుకోండి.
 9. అలాగే ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు కూడా నూరుకొని ముద్ద చేసుకొని విడిగా పెట్టుకోండి.
 10. ఒక మందపాటి మూకుడు లో ఒక గరిట నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తో పోపు పెట్టుకొని నూరుకున్న ఉల్లి పచ్చి మిరపకాయలు ముద్ద ,పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
 11. తరువాత పెసర పప్పు ముద్ద మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముద్ద ఉడికి జాస్ట పొడి పొడి గా మారే వరకు వేయించండి.
 12. మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి లేదంటే అడుగు అంటి మాడి పోయే అవకాశం ఉంది.
 13. పెసరపప్పు వేగిన తరువాత ఆవిరి ఉడికించుకున్న ఉండలు,కొబ్బరి తురుము వేసుకొని కాసిన్ని నీళ్లు చిలకరించి బాగా కలుపుకోండి.
 14. నీళ్లు చిలకరించడం వలన వేయించిన మసాలా ఉండల కు పట్టి రుచిగా ఉంటాయి లేదంటే మసాలా ఉండలు విడి విడిగా అనిపిస్తాయి.
 15. ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోండి ఆ పైన నిమ్మరసం , కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి కట్టేసి మీరో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచండి.
 16. ఎంతో రుచికరమైన మా తెలంగాణ రైల్ ఫలహారం మీ అందరి కోసం. వెంటనే చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

నిమ్మరసం రుచికి అనుగుణంగా వేసుకోండి. ఈ వంటకం రెండు రోజుల పాటు నిలువ ఉంటుంది.

Reviews for Steamed rice balls with spicy seasoning Recipe in Telugu (0)