హోమ్ / వంటకాలు / రైల్ ఫలహారం

Photo of Steamed rice balls with spicy seasoning by Sukriti Siri at BetterButter
381
2
0(0)
0

రైల్ ఫలహారం

Aug-20-2018
Sukriti Siri
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రైల్ ఫలహారం రెసిపీ గురించి

రైల్ ఫలహారం ఒక సాంప్రదాయిక తెలంగాణ వంటకం. తర తరాలుగా తెలుగు వారు దీనిని ఆస్వాదిస్తున్నారు. పండుగల సమయం లో ప్రత్యేకముగా వినాయక చవితి నాడు దీనిని తప్పక వండి దేవునికి నివేదన చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో విధముగా దీనికి తాలింపు మరియు మసాలా నూరికుని తయారు చేస్తారు. కొందరు కేవలం పచ్చి కొబ్బరి తురుము తో, మరికొందరు ఉల్లి కారం తో , మరిందరు పెసపప్పు ఉల్లికారం తో చేస్తారు. ఈ రోజు నేను మీకు మా తాతమ్మ గారు చేసే విధానాన్ని పరిచయం చేస్తాను. అది రుచి చూసే భాగ్యం నాకు కలగ పోయిన ఆవిడ దెగ్గర నేర్చుకున్న మా నాయనమ్మ చేతి రుచి చూసే భాగ్యం దక్కింది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • టిఫిన్ వంటకములు
 • తెలంగాణ
 • చిన్న మంట పై ఉడికించటం
 • ఉడికించాలి
 • ఆవిరికి
 • చల్లగా చేసుకోవటం
 • వేయించేవి
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. 4 కప్పులు : వరిపిండి
 2. 2 కప్పులు : నీళ్లు
 3. 1 చెంచా : ఉప్పు
 4. 1 చెంచా : నూనె
 5. 1/2 కప్పు : పెసర పప్పు
 6. 2 : ఉల్లిపాయలు (మధ్య రకం)
 7. సగం చిప్ప : పచ్చి కొబ్బరి
 8. 6-8 : పచ్చి మిరపకాయలు
 9. 1 గరిట : నూనె
 10. 1 చెంచా : జీలకర్ర
 11. 1 చెంచా : ఆవాలు
 12. 2 రెమ్మలు : కరివేపాకు
 13. 1/2 చెంచా : పసుపు
 14. 1 గుప్పెడు : కొత్తిమీర
 15. ఉప్పు రుచికి సరిపడా
 16. 3-4 పెద్ద చెంచాల : నిమ్మరసం

సూచనలు

 1. పిండి ఉప్పటానికి : రెండు కప్పుల నీళ్లు , ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా నూనె వేసుకొని మరగించండి.
 2. మరుగుతున్న నీళ్లలో 4 కప్పుల వరిపిండి వేసుకొని బాగా కలిపి , మూత పెట్టి, పొయ్యి ఆర్పేయండి.
 3. ఒక పది నిమిషాల తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి పిండి ముద్ద ని తయారు చేసుకోండి.
 4. కొంచెం కొంచెం పిండి ని వేరు చేసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోండి. దాదాపు రేగు పండు సైజులో.
 5. ఇలాగే పూర్తి గా ఉప్పిన పిండి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక లోతు గిన్నెలోకి వేసుకోండి.
 6. ఈ ఉండలు చేయటానికి కాస్త సమయం పట్టినా చూడటానికి , తినటానికి ఎంతో అందంగా ఉంటాయి.
 7. ఇప్పుడు ఈ ఉండలని ఆవిరి ఉడికించి పెట్టుకోండి.
 8. సగం కప్పు పెసరపప్పు శుభ్రం చేసుకుని సరిపడా నీళ్లు పోసుకొని అరగంట పాటు నాన బెట్టుకొని మెత్తటి ముద్ద చేసి పెట్టుకోండి.
 9. అలాగే ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు కూడా నూరుకొని ముద్ద చేసుకొని విడిగా పెట్టుకోండి.
 10. ఒక మందపాటి మూకుడు లో ఒక గరిట నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తో పోపు పెట్టుకొని నూరుకున్న ఉల్లి పచ్చి మిరపకాయలు ముద్ద ,పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
 11. తరువాత పెసర పప్పు ముద్ద మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముద్ద ఉడికి జాస్ట పొడి పొడి గా మారే వరకు వేయించండి.
 12. మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి లేదంటే అడుగు అంటి మాడి పోయే అవకాశం ఉంది.
 13. పెసరపప్పు వేగిన తరువాత ఆవిరి ఉడికించుకున్న ఉండలు,కొబ్బరి తురుము వేసుకొని కాసిన్ని నీళ్లు చిలకరించి బాగా కలుపుకోండి.
 14. నీళ్లు చిలకరించడం వలన వేయించిన మసాలా ఉండల కు పట్టి రుచిగా ఉంటాయి లేదంటే మసాలా ఉండలు విడి విడిగా అనిపిస్తాయి.
 15. ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోండి ఆ పైన నిమ్మరసం , కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి కట్టేసి మీరో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచండి.
 16. ఎంతో రుచికరమైన మా తెలంగాణ రైల్ ఫలహారం మీ అందరి కోసం. వెంటనే చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర