బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ | Biyyam pindi roti, ananpa kaya. Curry Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Biyyam pindi roti, ananpa kaya. Curry recipe in Telugu,బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ, Pendekanti Suneetha
బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీby Pendekanti Suneetha
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

6

0

బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ వంటకం

బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biyyam pindi roti, ananpa kaya. Curry Recipe in Telugu )

 • బియ్యం పిండి 1 గ్లాస్
 • నీళ్లు 1 1/2 గ్లాస్
 • ఉప్పు తగినంత
 • అనప కాయ కర్రి కోసం
 • అనప కాయలు 1 కేజీ
 • ధనియాలు 2 స్పూన్స్
 • జీలకర్ర 1 స్పూన్
 • మిరియాలు 10
 • ఉల్లిగడ్డలు 4
 • పచ్చి కొబ్బరి తురుము 4 స్పూన్స్
 • ఉప్పు తగినంత
 • ఎండు మిర్చి 8

బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ | How to make Biyyam pindi roti, ananpa kaya. Curry Recipe in Telugu

 1. ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి అందులో ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి స్టవ్ పై పెట్టి నీటిని మరిగించాలి.
 2. నీళ్లు మరిగాక అందులో బియ్యం పిండి వేయాలి.కలపరాదు .సిమ్ లో ఉంచి 15 నిమిషాలు ఉడికించాలి.
 3. తర్వాత పప్పు గుత్తి కాడ తో బాగా పిండిని కలిపి చల్లారాక పిండిని బాగా నాదాలి.
 4. నానిన పిండిని ముద్దలు చేసి చపాతీ లాగా పీటపై కింద పిండి వేసి తిక్కాలి.
 5. స్టవ్ పై పెనము పెట్టి చపాతీ లాగా నూనె వేసి కాల్చాలి.
 6. కర్రీ కోసం :
 7. అనపకాయల ను వలిచి విత్తనాలను నీటిలో 5 గంటలు నానబెట్టాలి.
 8. నానిన తర్వాత ఒక విత్తనం పట్టుకొని నొక్కితే పైన పొట్టు పోయి లోపలి విత్తనం వస్తుంది. ఇలా అన్ని విత్తనాలు అలాగే చేయాలి
 9. తర్వాత ఒక ఉల్లిగడ్డను స్టవ్ పై పెట్టి కాల్చి పొట్టు తీసి పెట్టుకోవాలి
 10. ఉల్లిగడ్డలును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 11. ధనియాలు, జీలకర్ర,ఎండుమిర్చి,మిరియాలు కలిపి ఒక స్పూన్ నూనె వేసి వేయించి పొడి చేసుకోవాలి.
 12. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్స్ నూనె వేసి కాగాక అందులో పొట్టు తీసిన విత్తనాలను వేసి అందులో పొడి చేసుకున్న మసాలా పొడి వేసి 2 నిమిషాలు వేయించి అందులో 1 గ్లాస్ నీళ్ళు వేసి ముద్ద పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి.
 13. కాల్చిన ఉల్లిగడ్డ,1 పచ్చి ఉల్లిగడ్డ,పచ్చి కొబ్బరి తురుము కలిపి నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చెయ్యాలి.
 14. స్టీమ్ పోయాక అందులో ఉల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
 15. ఇది కర్ణాటక రిసిపీ

Reviews for Biyyam pindi roti, ananpa kaya. Curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo