హోమ్ / వంటకాలు / బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ

Photo of Biyyam pindi roti, ananpa kaya. Curry by Pendekanti Suneetha at BetterButter
339
1
0.0(0)
0

బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ

Aug-20-2018
Pendekanti Suneetha
45 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి ఉప్పిన రోటీ, అనపకాయ కర్రీ రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంట. బియ్యం పిండి ఉదకబెట్టి చేస్తాము.అనపకాయలు ఇవి కర్ణాటక, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఈ సీజన్ లో బాగా చిక్కుతాయి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • కర్ణాటక
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

 1. బియ్యం పిండి 1 గ్లాస్
 2. నీళ్లు 1 1/2 గ్లాస్
 3. ఉప్పు తగినంత
 4. అనప కాయ కర్రి కోసం
 5. అనప కాయలు 1 కేజీ
 6. ధనియాలు 2 స్పూన్స్
 7. జీలకర్ర 1 స్పూన్
 8. మిరియాలు 10
 9. ఉల్లిగడ్డలు 4
 10. పచ్చి కొబ్బరి తురుము 4 స్పూన్స్
 11. ఉప్పు తగినంత
 12. ఎండు మిర్చి 8

సూచనలు

 1. ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి అందులో ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి స్టవ్ పై పెట్టి నీటిని మరిగించాలి.
 2. నీళ్లు మరిగాక అందులో బియ్యం పిండి వేయాలి.కలపరాదు .సిమ్ లో ఉంచి 15 నిమిషాలు ఉడికించాలి.
 3. తర్వాత పప్పు గుత్తి కాడ తో బాగా పిండిని కలిపి చల్లారాక పిండిని బాగా నాదాలి.
 4. నానిన పిండిని ముద్దలు చేసి చపాతీ లాగా పీటపై కింద పిండి వేసి తిక్కాలి.
 5. స్టవ్ పై పెనము పెట్టి చపాతీ లాగా నూనె వేసి కాల్చాలి.
 6. కర్రీ కోసం :
 7. అనపకాయల ను వలిచి విత్తనాలను నీటిలో 5 గంటలు నానబెట్టాలి.
 8. నానిన తర్వాత ఒక విత్తనం పట్టుకొని నొక్కితే పైన పొట్టు పోయి లోపలి విత్తనం వస్తుంది. ఇలా అన్ని విత్తనాలు అలాగే చేయాలి
 9. తర్వాత ఒక ఉల్లిగడ్డను స్టవ్ పై పెట్టి కాల్చి పొట్టు తీసి పెట్టుకోవాలి
 10. ఉల్లిగడ్డలును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 11. ధనియాలు, జీలకర్ర,ఎండుమిర్చి,మిరియాలు కలిపి ఒక స్పూన్ నూనె వేసి వేయించి పొడి చేసుకోవాలి.
 12. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్స్ నూనె వేసి కాగాక అందులో పొట్టు తీసిన విత్తనాలను వేసి అందులో పొడి చేసుకున్న మసాలా పొడి వేసి 2 నిమిషాలు వేయించి అందులో 1 గ్లాస్ నీళ్ళు వేసి ముద్ద పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి.
 13. కాల్చిన ఉల్లిగడ్డ,1 పచ్చి ఉల్లిగడ్డ,పచ్చి కొబ్బరి తురుము కలిపి నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చెయ్యాలి.
 14. స్టీమ్ పోయాక అందులో ఉల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
 15. ఇది కర్ణాటక రిసిపీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర