BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చింత పండు పులిహోర

Photo of Chinthapandu pulihora by Pendekanti Suneetha at BetterButter
0
1
0(0)
0

చింత పండు పులిహోర

Aug-20-2018
Pendekanti Suneetha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింత పండు పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ పులిహోర గుజ్జు చేసుకొని పెట్టుకొంటే 15 రోజులు నిల్వ ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యము 1 పావు
  2. నీళ్లు 2 పావులు
  3. చింతపండు పెద్ద నిమ్మకాయంత
  4. నూనె 8 స్పూన్స్
  5. ఆవాలు ,జీలకర్ర 1 స్పూన్
  6. మెంతులు 8 గింజలు
  7. పచ్చిమిర్చి. 10
  8. ఎండు మిర్చి 2
  9. వేరుశెనగ గుళ్ళు 3 స్పూన్స్
  10. మినపప్పు 2 స్పూన్స్
  11. సేనగపప్పు 2 స్పూన్స్
  12. బెల్లం చిన్న ముక్క
  13. ఉప్పు తగినంత
  14. MTR సాంబార్ పొడి 2 స్పూన్స్

సూచనలు

  1. చింతపండు ఒక గంటసేపు నానబెట్టి చిక్కగా రసము తీసుకోవాలి
  2. స్టవ్ పై ఒక బాణలి పెట్టి అందులో నూనె వేయాలి
  3. నూనె కాగాక అందులో ఆవాలు,జీలకర్ర,మెంతులు వేసి వేగాక సేనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ గుళ్లు వేసి బాగా వేగాక ఎండు మిర్చి, పచ్ఛిమిర్చి ,కరివేపాకు వేసి వేగాక అందులో చింతపండు రసం వేయాలి.అందులోనే ఉప్పు,బెల్లం వేసి బాగా ఉడకనివ్వాలి .
  4. నూనె పైకి తేలి బాగా ఉడకనివ్వాలి. ఉడికాక అందులో సాంబార్ పొడి వేసి కొద్దిగా ఉడికించి దించాలి.
  5. ఈ పులిహోర గుజ్జు 10 రోజులు నిలువ ఉంటుంది.
  6. అన్నం పొడి పొడిగా చేసుకొని ఈ గుజ్జు వేసి బాగా కలపాలి.
  7. రుచికరమైన పులిహోర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర