మునగాకు గోంగూర పచ్చడి | Munagaku Gongura chutney Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Munagaku Gongura chutney recipe in Telugu,మునగాకు గోంగూర పచ్చడి, Sudha Badam
మునగాకు గోంగూర పచ్చడిby Sudha Badam
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మునగాకు గోంగూర పచ్చడి వంటకం

మునగాకు గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Munagaku Gongura chutney Recipe in Telugu )

 • గోంగూర 1 కట్ట/ 2 కప్పులు
 • మునగాకు 2 కప్పులు
 • ధనియాలు 1 స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • మినపప్పు 1 స్పూన్
 • నూపప్పు 2 స్పూన్స్
 • మెంతులు 1/4 స్పూన్
 • ఎండుమిర్చి 10
 • వెల్లుల్లి 10 రెబ్బలు
 • ఇంగువ తగినంత
 • ఉప్పు తగినంత
 • పసుపు తగినంత
 • ఆయిల్ తగినంత

మునగాకు గోంగూర పచ్చడి | How to make Munagaku Gongura chutney Recipe in Telugu

 1. మూకుడులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, నూపప్పు, మెంతులు, ఎండుమిర్చి దోరగా వేయించుకుని మిక్సర్లోకి తీసుకోవాలి.
 2. అదే మూకుడులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, గోంగూర మగ్గించుకోవాలి.
 3. మిక్సర్లో పప్పులన్ని మెత్తగా నలిగాక ఈ ముద్ద,ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
 4. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.

నా చిట్కా:

తడి తగలకుండా చేసుకుంటే వారం రోజులపైనే నిలువ ఉంటుంది

Reviews for Munagaku Gongura chutney Recipe in Telugu (0)