పులుసుపిండి | Rice Ravva Pulihora Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice Ravva Pulihora recipe in Telugu,పులుసుపిండి, Sudha Badam
పులుసుపిండిby Sudha Badam
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

పులుసుపిండి వంటకం

పులుసుపిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice Ravva Pulihora Recipe in Telugu )

 • బియ్యపు రవ్వ 1 గ్లాసు
 • నీళ్లు 2 గ్లాసులు
 • చింతపండు నిమ్మకాయంత
 • బెల్లం చిన్న ముక్క
 • ఉప్పు, పసుపు తగినంత
 • పోపు దినుసులు
 • సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుసనగగుళ్లు
 • ఎండుమిర్చి, పచ్చిమిర్చి
 • కరివేపాకు

పులుసుపిండి | How to make Rice Ravva Pulihora Recipe in Telugu

 1. చింతపండుని నీళ్లల్లో నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకోవాలి.
 2. మూకుడులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి,వేడెక్కాక 2 గ్లాసులు నీళ్లు వేసి,ఉప్పు,పసుపు వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి.
 3. దాన్లో బియ్యపు రవ్వ పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపాలి.
 4. 10 నిమిషాలు తర్వాత కంచంలో చల్లారబెట్టుకోవాలి.
 5. మూకుడులో మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగేక చింతపండు పులుసు పోసి చిక్కగా ఉడకనిచ్చి ఉప్పు, పసుపు,బెల్లం వేసి దింపుకోవాలి.
 6. పోపు చల్లారాక ఆరబెట్టుకున బియ్యం రవ్వ మీద వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

నా చిట్కా:

తయారు చేసుకున్న 2-3 గంటల తర్వాత రుచిగా ఉంటుంది.

Reviews for Rice Ravva Pulihora Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo