కొరివికారం | Red chilli pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Aug 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Red chilli pickle by Sree Vaishnavi at BetterButter
కొరివికారంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  12

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

6

1

కొరివికారం

కొరివికారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chilli pickle Recipe in Telugu )

 • పండు మిరపకాయలు – 1 కేజీ
 • చింతపండు – 200 గ్రాములు
 • ఉప్పు – 250 గ్రాములు
 • పసుపు – 50 గ్రాములు
 • మెంతి పొడి – 1 చెంచా
 • ఆవాలు – 1 చెంచా
 • జీలకర్ర – 1 చెంచా
 • కరివేపాకు – 3 రెబ్బలు
 • నూనె – 200 గ్రాములు

కొరివికారం | How to make Red chilli pickle Recipe in Telugu

 1. ముందుగా మిరపకాయలను గుడ్డతో తడి లేకుండా తుడవాలి. 
 2. చింతపండులో గింజలు లేకుండా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 
 3. మిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని  ఉప్పు, పసుపు, చింతపండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. 
 4. మరీ మెత్తగా కాకుండా బరకగా ఉంటే చాలు. 
 5. దీనిని తీసి ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి.
 6. మూడు రోజుల తర్వాత మళ్లీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. 
 7. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు  కావలసినంత పచ్చడి తీసి దానికి సరిపడా , మెంతి పొడి కలిపి, మళ్లీ మెత్తగా రుబ్బుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే చాలు. 
 8. రుచికరమైన పండుమిరపకాయ పచ్చడి తయారు. 
 9. ఉప్పు సరిగ్గా కొలతతో వేసి రుబ్బుకుంటే ఏడాది వరకు నిలవ ఉంటుంది.  

నా చిట్కా:

నీళ్లతో కడగొద్దు. ఈ పచ్చడి చేసేటప్పుడు తడి అస్సలు తగలకూడదు.

Reviews for Red chilli pickle Recipe in Telugu (1)

Punnareddy Akkala2 years ago

జవాబు వ్రాయండి