పెసర కట్టు | Green gram rasam Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  23rd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Green gram rasam recipe in Telugu,పెసర కట్టు, Sudha Badam
పెసర కట్టుby Sudha Badam
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

5

0

పెసర కట్టు వంటకం

పెసర కట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green gram rasam Recipe in Telugu )

  • పెసరపప్పు చిన్న గిన్నెడు
  • పెద్ద టమాటా 1
  • అల్లం చిన్న ముక్క
  • పచ్చిమిర్చి 4
  • వెల్లుల్లి రెబ్బలు 5
  • పోపు దినుసులు- మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
  • కొత్తిమీర కొద్దిగా

పెసర కట్టు | How to make Green gram rasam Recipe in Telugu

  1. పెసరపప్పు కడిగి అందులో టమాటా కట్ చేసి వేసి కుక్కర్లో పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి.
  2. కుక్కర్ చల్లారాక పప్పుని మెత్తగా మెదిపి ఉంచుకోవాలి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నీలో రెండు స్పూన్లు నూనె వేసి పోపు దినుసులు, చిన్న ముక్కలుగా కోసిన అల్లం, వెల్లులి,కరివేపాకు వేసి మెత్తగా మెదిపిన పప్పుని అందులో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి 10 నిమిషాలు మరగనివ్వాలి.
  4. చివరగా కొత్తిమీర వేసి దింపుకోవాలి.

నా చిట్కా:

కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు.

Reviews for Green gram rasam Recipe in Telugu (0)