హోమ్ / వంటకాలు / పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట.

Photo of Milk mixed rice flour sweet by Dharani Jhansi Grandhi at BetterButter
628
6
0.0(0)
0

పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట.

Aug-24-2018
Dharani Jhansi Grandhi
30 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట. రెసిపీ గురించి

చిన్న పిల్లలు బాగా ఇష్టం గా తినే స్వీట్.మేము పండుగలలో ఎక్కువ గా చేసుకునే వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు పిండి 1 కప్
  2. బెల్లం 1 కప్
  3. పాలు 3 కప్పులు
  4. నెయ్యి కొద్దిగా
  5. 1 కప్ నీళ్లు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి ,బెల్లం చిన్న ముక్క వేసి ఎసరు మరగ నివ్వాలి.
  2. మరిగాక స్టౌవ్ ఆఫ్ చేసి అందులో బియ్యపుపిండి వేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి.ఆ తరువాత పిండి అంత మెత్తగా ముద్దలా నొక్కి చిన్న చిన్న ముక్కలుగా గా చేసుకోవాలి సగం పిండి తాలికులికి తీసి సగం పిండి లో నీళ్లు పోసి ఉండలు లేకుండా జారు గా కలిపి వుంచుకోవాలి.
  3. చేతికి కొద్దిగా నెయ్యి రాసి తాలుకులికి తీసిన పిండి నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పైన చూపించిన విధంగా గా తాలికు లు చేసుకుని పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టీ పాలు మరిగించాలి పాలు మరిగాక తాలికులు వేసి ఉడక నివ్వాలి అవి ఉడికాక పైకి తేలుతాయి .
  5. పొయ్యి సిమ్ లో పెట్టీ చేసుకోవాలి .తాలుకులు తేలిన తర్వాత జారు గా కలిపిన పిండి నీ పోసి ఉడక నిచ్చి బాగా కుత కుత లాడక స్టౌవ్ ఆఫ్ చేసి ఒక కప్ బెల్లం వేసి కలిపి దించేయాలి.
  6. బెల్లం పొడి ల కొట్టుకుని వుంచుకోవాలి.బెల్లం కరగక పోతే పొయ్యి సిమ్ లో పెట్టీ కలిపి కట్టేయలి.అంతే పాలతలికులు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర