పోపు అన్నం | Popu ann Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Popu ann recipe in Telugu,పోపు అన్నం, Sree Vaishnavi
పోపు అన్నంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

పోపు అన్నం వంటకం

పోపు అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Popu ann Recipe in Telugu )

 • రాత్రి మిగిలిపోయిన అన్నం 2 కప్పులు
 • మినపప్పు 1 చెంచా
 • సెనగపప్పు 1 చెంచా
 • ఆవాలు 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • పచ్చిమిర్చి 2-3
 • క్యారెట్ 1/2 కప్
 • పసుపు చిటికెడు
 • పల్లీలు 2 చెంచాలు
 • నూనె 2-3 చెంచాలు
 • ఉప్పు తగినంత
 • బీన్స్ 1/4 కప్
 • ఎండుమిరపకాయలు 1-2
 • కరివేపాకు 1 రెమ్మ
 • కొత్తిమీర 2 చెంచాలు
 • ఉల్లిపాయ తరిగినది 2

పోపు అన్నం | How to make Popu ann Recipe in Telugu

 1. ముందుగా మిగిలిపోయిన అన్నం లో ఉప్పు పసుపు నూనె వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి
 2. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
 3. అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు పల్లీలు వేసి వేగనివ్వాలి
 4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేగనివ్వాలి
 5. వేగిన తరువాత అందులో క్యారెట్, బీన్స్ వేసి వేగనివ్వాలి
 6. వేగిన తరువాత అందులో ఉప్పు ,పసుపు,కారం ,వేసి అందులో అన్నం వేసి వేగిన తరువాత సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర తో

Reviews for Popu ann Recipe in Telugu (0)