మామిడికాయ పులిహోర | Mango Pulihora Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  25th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Mango Pulihora by Sudha Badam at BetterButter
మామిడికాయ పులిహోరby Sudha Badam
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మామిడికాయ పులిహోర

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Pulihora Recipe in Telugu )

 • వండిన అన్నం 4 కప్పులు
 • మామిడికాయ 1
 • 1 చెంచా ఆవాలు
 • 1 చెంచా జీలకర్ర
 • 1 పెద్ద చెంచా సెనెగ పప్పు
 • 1 పెద్ద చెంచా మిన పప్పు
 • 3 చెంచాలు వేరుశెనిగ గుళ్ళు
 • 3 ఎండు మిరపకాయలు
 • 2 పచ్చి మిరపకాయలు
 • 1 రెమ్మ కరివేపాకు
 • చిటికెడు ఇంగువ

మామిడికాయ పులిహోర | How to make Mango Pulihora Recipe in Telugu

 1. ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండుకుని పళ్ళెంలో పోసుకుని చల్లారబెట్టుకోవాలి.
 2. మూకుడులో 3 స్పూన్స్ నూనె వేసి పోపు దినుసులు వేసి వేగనివ్వాలి
 3. ఆ తరువాత సెనిగ పప్పు, మిన పప్పు, వేరుశెనిగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించాలి
 4. పచ్చిమిరపకాయ చీరికలు , ఎండు మిరపకాయలు , కరివేపాకు, ఇంగువ కూడా వేసి వేయించాలి
 5. అందులోనే మామిడికాయ తురుము వేసి, ఉప్పు, పసుపు కూడా వేసి అంతా బాగా కలిపి మామిడికాయ తురుము కొద్దిగా వేగినట్టు అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనిచ్చి అన్నంలో కలుపుకోవాలి.

నా చిట్కా:

చేసిన 1 గంట తర్వాత తింటే బాగుంటాది.

Reviews for Mango Pulihora Recipe in Telugu (0)