హోమ్ / వంటకాలు / గంజి దోస ( బ్రెడ్ దోస)

Photo of Ganji dosa by Pendekanti Suneetha at BetterButter
1866
1
0.0(0)
0

గంజి దోస ( బ్రెడ్ దోస)

Aug-26-2018
Pendekanti Suneetha
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గంజి దోస ( బ్రెడ్ దోస) రెసిపీ గురించి

ఈ దోస బియ్యం రవ్వ గంజి ఉదకబెట్టి చేస్తాము.ఈ దోస మా అత్త గారు చేసేవారు.పిండి రోట్లో దంచించి చేసేవారు. కానీ ఇప్పుడు మేము పిండి మర పట్టించి చేస్తాము.దోసెలు చాలా మెత్తగా బాగుంటాయి. ఈ పిండితో ఉతప్పం,పొంగణాలు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం 1 కేజీ
  2. బియ్యం రవ్వ 1/4 గ్లాస్
  3. నీళ్లు 6 పావులు
  4. సగ్గుబియ్యం 2 పిడికేడ్లు
  5. బెల్లం చిన్న ముక్క
  6. ఉప్పు తగినంత
  7. సోడాపోడి కొద్దిగా
  8. ఆయిల్ దోసెలు వేయడానికి సరిపడా

సూచనలు

  1. బియ్యం బాగా కడిగి రెండు గంటలు నానబెట్టి నీరు తీసేసి బియ్యం అరబెట్టి. తడి బియ్యం మర పట్టించాలి.
  2. సగ్గుబియ్యం లో కొన్ని నీళ్లు వేసి కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి.
  3. ఒక గిన్నెలో ఆరు పావుల నీళ్లు వేసి అందులో వన్ స్పూన్ ఆయిల్, బెల్లం, చిటికెడు ఉప్పు వేసి కాగనివ్వాలి.
  4. నీళ్లు కాగాక అందులో బియ్యం రవ్వ ,ఉడికించిన సగ్గుబియ్యం వేసి బాగా కలిపి గంజి లాగా ఉదకబెట్టాలి.
  5. రాత్రి గంజి బాగా చల్లారాక మరపట్టించిన బియ్యం పిండి వేసి బాగా గట్టిగా కలిపి పెట్టాలి.
  6. ఉదయానికి పిండి బాగా లూస్ అయ్యుంటుంది.
  7. పిండి బాగాకలిపి అందులో సోడాపోడి,ఉప్పు వేసి కలపాలి.పిండిలో నీళ్లు వేయారాదు.
  8. స్టవ్ పై పెన్నాం పెట్టి ఆయిల్ వేసి మందంగా దోస వేయాలి.
  9. దోస కాలాక అటువైపు తిప్పి దోస కాల్చాలి.
  10. ఈ దోసకు పల్లి చెట్నీ , ఎర్రకారం బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర