హోమ్ / వంటకాలు / చిక్కుడుకాయ వేపుడు

Photo of chkkudu kaaya vepudu by Kavitha Perumareddy at BetterButter
50
2
0.0(0)
0

చిక్కుడుకాయ వేపుడు

Aug-27-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడుకాయ వేపుడు రెసిపీ గురించి

ఈ వంట చాలా సులభంగా ఐపోతుంది.హెల్త్ కు కూడా మంచింది .చిక్కుడుకాయ ఇంతకుముందు సంవత్సరంలో 4,5 నెలలు మాత్రమే దొరికేవి.ఇప్పుడు అన్నికాలల్లో దొరుకుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. చిక్కుడుకాయ లు 1/2 కేజీ
  2. టమాటాలు 2
  3. ఉల్లిపాయలు పెద్దది 1
  4. పచ్చిమిర్చి 4
  5. కారం 1స్పున్
  6. ఉప్పు తగినంత
  7. పసుపు సగం స్పూన్
  8. ధనియాలపొడి 1 స్పూన్
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్
  10. నూనె 2 స్పూన్స్
  11. కొత్తిమీర, కరేపాకు కొద్దిగా
  12. పోపుగింజెలు 1 స్పున్
  13. ఎండుమిర్చి 3

సూచనలు

  1. ముందుగా చిక్కుడుకాయ లు పీచులు తీసి చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు చిక్కుడుకాయ లు ఒక గిన్నెలో వేసి గ్లాస్ నీళ్లు ,కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్ లో ఐతే 2 విజిల్స్ సరిపోతుంది.
  3. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని నూనె వేసి వేడి చేసి పోపుగింజెలు ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఉల్లిపాయముక్కలు వేసి మగ్గించాలి.తరువాత అల్లం వెల్లుల్లి మిశ్రమం ,పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగినతరువాత టమాటా ముక్కలు వేసి కాసేపు మగ్గించాలి .
  4. టమాటా మగ్గిన తరువాత దానిలో తగినంత ఉప్పు, కారం,పసుపు,ధనియాలపొడి, వేసి కలపాలి ...ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయ లు వేసి అంతా కలిసేలా బాగా కలిపి చిన్న మంట మీద పది నిముషాలు మగ్గించాలి.
  5. మగ్గిన తరువాత కరివేపాకు, కొత్తిమీర ను వేసి కలిపి పోయిమీద నుండి దింపి వడ్డించే గిన్నెలోకి తీసుకోవాలి.
  6. అంతే వేడి వేడిగా చెపాతి ,రొటిలోకి చిక్కుడుకాయ ప్రై సిద్ధం ...:relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర