మజ్జిగ పులుసు | Buttermilk soup ( I dont know exact name) Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Buttermilk soup ( I dont know exact name) recipe in Telugu,మజ్జిగ పులుసు, Swapna Sashikanth Tirumamidi
మజ్జిగ పులుసుby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

7

0

మజ్జిగ పులుసు వంటకం

మజ్జిగ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Buttermilk soup ( I dont know exact name) Recipe in Telugu )

 • చిక్కని పుల్ల/కమ్మటి మజ్జిగ ఒక లీటరు
 • ఆనపకాయ ముక్కలు ఒక కప్పు
 • ములక్కాడ ముక్కలు ఒక కప్పు
 • బెండకాయ ముక్కలు ఒక కప్పు
 • కేరెట్(కావాలంటే) ఒకటి
 • పచ్చి మిర్చి 4
 • పచ్చి కొబ్బరి ముక్క చిన్నది.
 • జీలకర్ర అర చెంచా
 • ధనియాలు ఒక చెంచా
 • పెసర/శనగ పిండి 3 చెంచాలు.(నేను పెసర పిండి వాడాను.)
 • అల్లంముక్క చిన్నది
 • నెయ్యి 2 చెంచాలు
 • పసుపు, ఉప్పు కొద్ది గా
 • పోపునకు...ఆవాలు, జీలకర్ర,మెంతులు, వాము,ఇంగువ... అన్ని పావు చెంచాడు చప్పున.
 • ఎండుమిర్చి 4
 • కరివేపాకు ,కొత్తిమీర కొద్దిగా
 • చివరలో ఆవపెట్టుకోడానకి ....ఆవాలు 2చెంచాలు.

మజ్జిగ పులుసు | How to make Buttermilk soup ( I dont know exact name) Recipe in Telugu

 1. ముందు కూరముక్కలన్నీ కావలసిన సైజులో తరిగి ఒక పెద్ద గిన్ని లో వేసి బెండకాయ మినహా అన్ని వేసి,2 పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు ,ముక్కలు మునిగేవరకూ నీరు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించాలి.
 2. కూర ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి ఉడికించాలి.. ఇలా చేయడం వల్ల బెండకాయ ముక్కలు సమంగా ఉడికి ,విడిపోకుండా ఉంటాయి.
 3. ఈలోగా.. 2 చెంచాల ఆవాలు, ఒక ఎండుమిర్చి ఒక చిన్న గిన్ని లో వేసి వేడి నీరు పోసి పక్కన పెట్టుకోవాలి.
 4. మజ్జిగ ఒక పెద్ద గిన్ని లోకి తీసుకుని, కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి.ఛాయపసుపు వాడితే పులుసు మంచి రంగు తో బావుంటుంది.
 5. తర్వాత ఒక మిక్సీ జారులో...అల్లం ,కొబ్బరి,ఒక పచ్చి మిర్చి, జీలకర్ర, ధనియాలు, పెసర/శనగ పిండి వేసి కొంచెం నీరు పోసి ...మెత్తగా‌ ,జారుగా రుబ్బుకోవాలి.
 6. ఈ మిశ్రమాన్ని మజ్జిగ లో వేసి కలపి పక్క పొయ్యిమీద...,సన్నని మంట మీద ఉంచి,మధ్యలో కలుపుతూ ఉండాలి.
 7. ఈలోగా కూరముక్కలన్నీ ఉడికి నీరు ఇగిరి ఉంటాయి..ఈ ముక్కలు ఉడుకుతున్న మజ్జిగ లో వేసి కొత్తిమీర వేసి మరికొద్ది సేపు .... అంటే పెసరపిండి పచ్చి వాసన పోయేదాకా ఉడికించాలి..మంట చిన్నదే ఉండాలి.... లేకపోతే మజ్జిగ విరిగిపోతుంది.
 8. ఈలోగా మిక్సీలో... నానపెట్టిన ఆవాలు ,ఎండుమిర్చి ని పేస్టులా చేసి ,చిటికెడు ఉప్పు, రెండు నూనె చుక్కలు వేసి కలిపి ,ఘాటు పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి....నూనె...ఉప్పు వెయ్యడం వల్ల ఆవముద్ద కండ్ర ఎక్కకుండా ఉంటుంది.
 9. ఈపాటికి మజ్జిగ పులుసు బాగా ఉడికిపోతుంది...పోపు గరిట పెట్టి నెయ్యి వేసి కాగాక ఆవాలు,వాము జీలకర్ర, మెంతులు,ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి ,కరివేపాకు... చక్కగా ఘుమ ఘుమలడేలా వేయించి పోపు పెట్టి వెంటనే మూత పెట్టి ,మంట ఆపేయ్యాలి.
 10. ఓపదినిముషాలు పోయాక రెడీచేసుకున్న ఆవముద్ద ను ఈ మజ్జిగపులుసు లో బాగా కలిపితే రుచికరమైన మజ్జిగపులుసు తినడానికి సిధ్ధం.

నా చిట్కా:

ఆవాలు పొడి కొట్టి ఉప్పు కలిపి స్టోర్ చేసుకుంటే ఆవపెట్టాల్సి వచ్చిన ప్పుడు వంట సులభం అవుతుంది.

Reviews for Buttermilk soup ( I dont know exact name) Recipe in Telugu (0)