పాలకూర పచ్చడి | Palak chutney Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  28th Aug 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Palak chutney by Sudha Badam at BetterButter
పాలకూర పచ్చడిby Sudha Badam
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

10

1

పాలకూర పచ్చడి వంటకం

పాలకూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak chutney Recipe in Telugu )

 • పాలకూర 2 కట్టలు
 • ఉల్లిపాయ 1
 • చింతపండు కొద్దిగా
 • కొబ్బరి 1 టేబుల్ స్పూన్
 • పసుపు కొద్దిగా
 • సెనగపప్పు 2 స్పూన్లు
 • మినపప్పు 2 స్పూన్లు
 • ఎండుమిర్చి 3
 • పచ్చిమిర్చి 1
 • జీలకర్ర, ఆవాలు కొద్దిగా
 • ఉప్పు తగినంత

పాలకూర పచ్చడి | How to make Palak chutney Recipe in Telugu

 1. పాన్లో 2 స్పూన్స్ నూనె వేసి సెనగపప్పు, మినపప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కడిగిన పాలకూర వేసి మగ్గాక కొబ్బరి వేసి2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి.
 2. మిక్సీ జార్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని చింతపండు, ఉప్పు,పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 3. కావాలంటే మళ్ళా పోపు వేసుకోవచ్చు.పెట్టకపోయినా బాగుంటుంది. నేను పెట్టలేదు.

నా చిట్కా:

పాలకూరలో పోషక విలువలు ఎక్కువ కాబట్టి పచ్చడిలా చేసుకుంటే ఎక్కువగా తినడానికి వీలవుతుంది

Reviews for Palak chutney Recipe in Telugu (1)

Sravanti a year ago

జవాబు వ్రాయండి
gaddam sreenivasulu
8 months ago
good