కమ్మని అప్పలు. మెంతి పప్పు | Kammani appalu. Menthi pappu Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  28th Aug 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kammani appalu.  Menthi pappu recipe in Telugu,కమ్మని అప్పలు. మెంతి పప్పు, Pendekanti Suneetha
కమ్మని అప్పలు. మెంతి పప్పుby Pendekanti Suneetha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

4

1

కమ్మని అప్పలు. మెంతి పప్పు వంటకం

కమ్మని అప్పలు. మెంతి పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kammani appalu. Menthi pappu Recipe in Telugu )

 • బియ్యం పిండి 1 పెద్ద గ్లాస్
 • సేనగపప్పు 1 స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • ఉప్పు తగినంత
 • నూనె వేయించటానికి సరిపడా
 • మెంతి పప్పు కోసం
 • కందిపప్పు 1 కప్
 • ఎండుమిర్చి 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 • మెంతులు 1/2 స్పూన్
 • ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసు కోవాలి
 • ఆవాలు,జీలకర్ర 1/2 స్పూన్
 • ఉప్పు తగినంత
 • పసుపు కొంచెం
 • చింతపండు కొంచెం
 • బెల్లం చిన్న ముక్క

కమ్మని అప్పలు. మెంతి పప్పు | How to make Kammani appalu. Menthi pappu Recipe in Telugu

 1. ఒక గిన్నెలో బియ్యంపిండి, ఉప్పు,జీలకర్ర, సేనగపప్పు వేసి బాగా కలపాలి.
 2. కలిపిన పిండిని నీళ్లు వేసి గట్టిగా ముద్దలా చేసి చిన్నచిన్న ఉండలుగా చెయాలి
 3. చిన్న ఉండలుగా చేసిన ముద్దను ప్లాస్టిక్ కవర్ మధ్యలో పెట్టి ప్రెస్సింగ్ మిషన్ లో పెట్టి ప్రెస్ చెయాలి.
 4. స్టవ్ పై బాణాలి లో నూనె పెట్టి బాగా కాగాక ప్రెస్ చేసుకున్న అప్పాన్ని నూనె లో వేయించాలి.
 5. కందిపప్పు ను అరగంట సేపు నానబెట్టాలి.
 6. ఒక చిన్న కుక్కర్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఎండుమిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక నీళ్లు తీసేసిన కందిపప్పు కూడవేసి ఒక నిమిషం వేయించి నీళ్లు వేసి కుక్కర్ లో 4 విజిల్స్ రానివ్వాలి.
 7. వేడి నీటిలో చింతపండు, బెల్లం 10 నిమిషాలు నానబెట్టాలి.
 8. కుక్కర్ స్టీమ్ పోయాక అందులో ఉప్పు,పసుపు,నానబెట్టిన చింతపండు,బెల్లం అన్ని కలిపి పప్పుగుత్తి తో ఎనిపి. బాగా ఉడికించాలి.
 9. ఈ కమ్మని అప్పలు ఉదయం టిఫిన్ కు బాగుంటుంది.

Reviews for Kammani appalu. Menthi pappu Recipe in Telugu (1)

Viji Swaroop4 months ago

Alaage ee biyyam Pindi lo fourth part groundnut podi kalipi chesthey chala tasty n smooth ga vasthayi....
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo