హోమ్ / వంటకాలు / పాకం గారెలు

Photo of SWEET vada by సౌమ్య అకోండి at BetterButter
0
3
0(0)
0

పాకం గారెలు

Aug-28-2018
సౌమ్య అకోండి
300 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం గారెలు రెసిపీ గురించి

సాంప్రదాయ వంటలు అనగానే ముందుగా పిండివంటలు గుర్తొస్తుంటాయి. పండుగ వస్తుందంటేనే పిండివంటలు చేసుకుంటాం,ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే బోలెడు వంటలు వండేసుకుంటాం.మొదటి పండుగ, కొత్త పంటలు,బియ్యం, పప్పులు,అన్ని కొత్తగా పండించుకుంటాం.భోగి రోజు చిన్ని పిల్లల భోగి పళ్ళతో మొదలు కనుమ పండుగ వరకు అన్ని సంప్రదాయ రుచులే. కనుమ నాడు మినుము తినాలి అని సంప్రదాయం. మా ఇంట్లో కొత్త పొట్టు మినప్పప్పు తో మా అమ్మ గారు పాకం గారెలు చేస్తారు, ఆ రెసిపీ మీకోసం

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పండుగలాగా
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. పొట్టు మినప్పప్పు - 1/4కేజీ
 2. బెల్లం- 1/4కేజీ లేదా పంచదార -1/4కేజీ
 3. నీరు- బెల్లం మునిగేల తీసుకోవాలి
 4. నూనె - గారెలు వేయించడానికి సరిపడా
 5. ఉప్పు తగినంత

సూచనలు

 1. 4గంటల పాటు మినప్పప్పు ని నానబెట్టి , పొట్టు తీసి శుభ్రంగా కడగండి
 2. గిన్నెలో బెల్లం వేసి నీరు పోసుకుని పాకం రెడి చేసుకోండి, తీగ పాకనికి దగ్గరగా ఉంటే చాలు
 3. ఇపుడు మెత్తగా మినప్పప్పు రుబ్బుకోవాలి
 4. స్టవ్ మీద నూనె పెట్టి అది కాగాక పిండిని అరిటాకు లేదా కవర్ మీద గారెలు ల వేసుకుని వేయించండి
 5. వేయించుకున్న గారెలు బెల్లం పాకం లో వేయండి
 6. పాకం కొద్ది సేపటికి పీల్చుకున్నాక బౌల్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర